Home » Entertainment » Samantha Emotional Post On Inistagram Got Viral In Social Media
Entertainment

Samantha : ఆ టాలీవుడ్ హీరో వైఫ్‌తో సమంత.. బాధ నుంచి బయటపడతానంటూ భావోద్వేగ పోస్టు..!

Authored By
mallesh
The Telugu News | Published on: November 5, 2021, 8:20 pm
Advertisement

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్య నుంచి డైవోర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఆ బాధ నుంచి బయట‌పడి తన రెగ్యులర్ బిజీ లైఫ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది సమంత. ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా పెట్టిన పోస్టు ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.దీపావళి సందర్భంగా సమంత హైదరాబాద్‌లోని తన ఇంట్లో సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేసుకుంది. దీపావళి సంబురాలను టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వైఫ్ ఉపాసన, శిల్పారెడ్డి‌తో చేసుకుంది సమంత. ఈ సందర్భంగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా సమంత పెట్టిన పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Samantha

బరువెక్కిన హృదయంతో సమంత అటువంటి పోస్టు పెట్టి ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీపావళి కాంతుల వెలుగులు విరజిమ్మలేదని, స్వీట్లలో ఉన్న రుచి కరువైందని, ఏడాది ఆరంభంలో బాధ కలిగితే ఆ తర్వాత వచ్చే పండుగలన్నీ చిన్నవైపోతాయని పేర్కొంది. సదరు పోస్టులో తాను అతి త్వరలో ఆ బాధ నుంచి బయటపడతానని, సంతోషంగా ఉంటానని సమంత పేర్కొనడం గమనార్హం. అలా సమంత పేర్కొనడం నాగచైతన్యతో విడాకులు గురించి చెప్పడమేనని నెటిజన్లు అంటున్నారు. మొత్తంగా సమంత నాగచైతన్యతో విడాకుల తర్వాత తన సొంత దారిలో తాను ప్రయణించేందుకు సిద్ధమవుతున్నది. తనను తాను చాలా బిజీ చేసుకుంటున్నట్లుగా కనబడుతున్నది.

Advertisement

Samantha : ఆ బాధ నుంచి బయటపడి సంతోషంగా ఉంటానంటున్న సమంత..

Samantha

సమంత సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’, కోలీవుడ్ సినిమా ‘కాతు వాకుల రెండు కాదల్’పూర్తి చేసింది. త్వరలో హిందీ ప్రాజెక్టుల గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ రాబోతున్నాయి. నాగచైతన్య సైతం తన సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోతున్నారు. ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ సక్సెస్ ఎంజాయ్ చేసిన నాగచైతన్య.. ప్రజెంట్ ‘బంగార్రాజు’ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ఇందులో నాగచైతన్య సరసన హీరోయిన్‌గా ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి నటిస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి