
Samantha emotional post on ukraine issues
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పర్సనల్ విషయాలతో పాటు సమాజంలో జరిగే పలు అంశాలపై కూడా స్పందిస్తుంటుంది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యపై సమంత స్పందించింది. ఇప్పటికే పలువురు సినీ తారలు ఈ చర్యను తప్పుబట్టారు. యుద్ధం అనేది ఏ కారణాలతో వచ్చినా అది మాత్రం పౌరుల, సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని అన్నారు. రష్యా చర్యలను తప్పు పడుతూ సమంత వరుస పోస్ట్‌లు చేస్తుండగా, ఇవి నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.ఉక్రెయిన్‌లోని ఓ ఆస్పత్రి ఐసీయూ నుంచి నవజాత శిశువులను బాంబ్ షెల్టర్‌లోకి తీసుకెళ్తున్న ఓ వీడియోను తన ఇన్స్‌స్టా స్టోరీలో షేర్ చేసిన సమంత.
. అప్పుడే పుట్టిన బిడ్డకు ఎన్ని కష్టాలో అంటూ ఎమోషనల్ కామెంట్ చేసింది. అంతేకాదు యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనుగొంది. అతని తెగువ, ధైర్యసాహసాలే అందుకు సాక్ష్యం అని పేర్కొన్న ఓ న్యూస్ ఆర్టికల్‌ని కూడా సామ్ షేర్ చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్ పరిస్థితులపై ఎంతోమంది సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత ఐదు రోజులుగా ఉక్రెయిన్ రష్యా బలగాల మధ్య భీకర పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు దేశాల మధ్య చర్చలు జరగగా, అవి అసంపూర్ణంగా మిగిలాయి.ఇక సమంత సినిమాల విషయానికొస్తే..
Samantha emotional post on ukraine issues
ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా కంప్లీట్ చేసింది. ఆమె కెరీర్‌లో రాబోతున్న తొలి పౌరాణిక సినిమా ఇది. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇది ఎంతగానో అలరించింది. సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు మరో ప్రయోగాత్మక సినిమా ‘యశోద’లో భాగమవవుతోంది సమంత. ఈ సినిమాలో నర్స్ పాత్రలో సమంత రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందని సమాచారం. విడాకుల తర్వాత కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన ఆమె.. బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేసేందుకు ఆసక్తి చూపుతోంది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.