Chandrababu : BIG BREAKING.. బీసీల పై చంద్రబాబు సంచలన నిర్ణయం..!
Chandrababu ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కసరత్తు వేగమైంది. బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బీసీలకు 34 శాతం సీట్ల హామీని నిలబెట్టుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు
Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు వేగంగా కొనసాగుతోంది. SIR ప్రక్రియ పూర్తైన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2025 ఎన్నికల జాబితా ఆధారంగానే ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశం కూడా కీలకంగా మారింది. బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికను సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి బిల్లు లేదా తీర్మానం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు సీట్ల కేటాయింపుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 34 శాతం సీట్లు కల్పించే విషయంలో వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Chandrababu : BIG BREAKING.. బీసీల పై చంద్రబాబు సంచలన నిర్ణయం..!
Chandrababu బీసీలకు 34 శాతం సీట్లు.. హామీ నిలబెట్టుకుంటామన్న చంద్రబాబు
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు కూటమి పార్టీల నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ చేసిన సిఫారసులపై చర్చ జరిగింది. కమిషన్ సిఫారసులను యథాతథంగా అమలు చేస్తే బీసీలకు 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటుందని చంద్రబాబు వివరించినట్లు సమాచారం. అయితే ఎన్నికల సమయంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చామని సీఎం గుర్తు చేశారు. ఆ హామీని నిలబెట్టుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు సూచించారు. న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే పరిస్థితి ఉంటే.. బీసీలకు పార్టీ పరంగా న్యాయం చేయాలని, వారికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అంటే రిజర్వేషన్ల విషయంలో న్యాయపరమైన అడ్డంకులు వచ్చినా బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం, కూటమి పార్టీలు పరిశీలించనున్నట్లు సీఎం వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.
Chandrababu అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ
మరోవైపు సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్‌నినో ప్రభావం, వ్యవసాయం, నీటిపారుదల, రాష్ట్రంలో శాంతిభద్రతలు వంటి అంశాలతో పాటు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 వ్యవహారంపై సిట్ సమర్పించిన నివేదికపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన అంశాలను కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం ఈ సమావేశాల్లో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన వివిధ బిల్లుల విషయంలోనూ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 18న జరిగే మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన వివిధ బిల్లుల ఆమోదంపై చర్చిద్దామని సీఎం చంద్రబాబు కూటమి నేతలకు వెల్లడించారు. మొత్తంగా చూస్తే.. ఒకవైపు స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు కొనసాగిస్తుండగా, మరోవైపు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. కమిషన్ నివేదిక, 27 శాతం రిజర్వేషన్ల పరిమితి, ఎన్నికల సమయంలో ఇచ్చిన 34 శాతం హామీ.. ఈ మూడు అంశాల మధ్య ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.







