
samantha fight with nithin
Samantha : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉంది సమంత. ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. సమంత నటించిన తాజా చిత్ర యశోద ఆగస్ట్ 12న రానుంది. కొద్ది రోజుల క్రితం ఈ డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు అదే టైంలో అక్కినేని ఇద్దరు హీరోలతో పాటు నితిన్ కూడా తమ సినిమాలతో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. మరి అందరు ఒకే సారి బరిలోకి వస్తే ఏ చిత్రం ప్రేక్షకులని ఎక్కువగా అలరిస్తుందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆగస్ట్ 12న సమంత, నాగ చైతన్య, అఖిల్, నితిన్ ఇలా అందరూ ఒకేసారి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతోన్నారు.
ఇందులో నాగ చైతన్య, ఆమిర్ ఖాన్‌తో కలిసి కాస్త ముందుగా రాబోతోన్నాడు. ఆమిర్ హీరోగా తెరకెక్కించిన లాల్ సింగ్ చద్దా చిత్రం ఆగస్ట్ 11న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకులకు అంత ఇంట్రస్ట్ ఉండకపోవచ్చు. కానీ అఖిల్ ఏజెంట్, నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా మీద మాత్రం ఇప్పటికే బజ్ ఏర్పడింది.ఈ రెండు సినిమాలు కూడా ఆగస్ట్ 12న రాబోతోన్నట్టు తమ విడుదల తేదీలను ప్రకటించేశాయి. ఇక సమంత యశోద సైతం తన డేట్‌ను లాక్ చేసేసుకుంది. రీసెంట్ గా నితిన్ కూడా అదే డేట్‌కి వస్తానని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.నితిన్ హీరోగా తెరకెక్కుతున్న విభిన్న యాక్షన్ డ్రామా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎస్. రాజశేఖర్‌రెడ్డి దర్శకుడు.
samantha fight with nithin
రీసెంట్ గా ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లకు మంచి లభించింది. టీజర్‌లో మాచర్ల నియోజకవర్గం సినిమాను జూలై 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడా తేదీ ఆగస్ట్ 12కు మారింది. సినిమాకి సంబంధించిన పనులు పూర్తి కాకపోవటంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేయక తప్పలేదని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఎఎస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ కనిపించబోతున్నాడు. ‘డేట్ మారింది అంతే.. కలెక్టర్ సార్ యాక్షన్ కాదు..’ అంటూ ట‍్వీట్ చేశారు. ఈ పోస్టర్‌లో వైట్ షర్ట్‌లో మాస్ లుక్‌తో ఆకట్టుకున్నాడు నితిన్
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.