Home » Entertainment » Samantha Games In Gym
Entertainment

Samantha : అలాంటి వారితో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది.. సమంత ఎమోషనల్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 20, 2021, 9:02 am
Advertisement

Samantha సమంత ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా ఆ సినిమా షూటింగ్‌ల కోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక ఆమె చేతిలో ఇప్పుడు మొత్తంగా మూడు ప్రాజెక్ట్‌లున్నట్టు అవుతుంది. నయన్, విజయ్ సేతుపతి, సమంత కలిసి చేస్తున్న కాథువాక్కుల రెండు కాదల్ సినిమా చివరి దశలో ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా మొన్న దసరా సందర్భంగా రెండు కొత్త ప్రాజెక్ట్‌లను వదిలింది సమంత.

Advertisement

Samantha Games In GYM

అలా సినిమాల పరంగా సమంత దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు సమంత మాత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. విడాకుల విషయాన్ని పూర్తిగా మరిచిపోయినట్టు అనిపిస్తోంది. తన పెట్ హష్‌తో ఎంజాయ్ చేస్తోంది. ఇక వర్కవుట్లతో మళ్లీ కుస్తీ పడుతోంది. రెగ్యులర్ వర్క్‌లను ప్రారంభించింది. నిన్న సమంత ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఎంతో సంతోషంగా కనిపించింది. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసింది.

Advertisement

Samantha ఆటల్లో మునిగిన సమంత

Samantha Games In GYM

ఆ వీడియోలో శిల్పా రెడ్డి ఫ్యామిలీ ఉన్నట్టు కనిపించింది. జిమ్‌లో అందరూ కలిసి రోప్ ఆట ఆడారు. రోప్‌కు ఒక వైపు సమంత, శిల్పా రెడ్డి ఉన్నారు. ఆ రోప్ ఆటలో శిల్పా రెడ్డి తన బలాన్ని అంతా వాడింది. కానీ సమంత మాత్రం చివర్లో కింద పడి పోయింది. తెగ నవ్వుతూ ఉంది. ఫిట్ నెస్ ఉన్న ఫ్యామిలీ మనుషులతో పెట్టుకోవద్దు.. ఇలానే జరుగుతుంది.. బాధపడాల్సి వస్తుంది.. దెబ్బలు తగులుతాయి.. అని సమంత చెప్పుకొచ్చింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి