samantha gives two bad news
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్న అందాల ముద్దుగుమ్మ సమంత. ఈ అమ్మడు వరుస చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసే పనిలో పడింది. కొద్ది రోజుల క్రితం కాతు వాకుల రెండు కాదల్ అనే చిత్రం పూర్తి చేయగా, ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదలైంది. సమంత, నయనతార, విజయ్ సేతుపతి నటించిన కన్మణి రాంబో ఖతీజా తెలుగులో మాత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తమిళ ప్రేక్షకులని కూడా చాలా నిరాశపరచింది. సమంత బర్త్ డే రోజు విడుదలైన మూవీ సమంత అభిమానులని కూడా బాగా నిరాశపరచింది. అయితే ఈ సినిమాను అతి త్వరలో హాట్‌స్టార్‌లో విడుచేయాలనీ చూస్తున్నారట చిత్రబృందం. మామూలుగా అయితే ఈ సినిమా విడుదలైన నాలుగు వారాలకు హాట్ స్టార్‌లో విడుదలకావాల్సి ఉంది.
అయితే సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో కాస్తా ముందుగానే ఓటీటీలోకి రానుందని అంటున్నారు.ఇక గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన పౌరాణిక పాన్ ఇండియన్ సినిమా శాకుంతలం. ఆదిపర్వంలోని శకుంతల – దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, సమంత బర్త్ డే రోజు శాకుంతలం సినిమా నుంచి సమంత లుక్ రిలీజ్ చేశారు. ఇందులో సమంత లుక్ అస్సలు ఆకట్టుకునేలా లేదు. పోస్టర్ లో ఏదో మిస్ అయినట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ పోస్టర్‌కే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయంటే శాకుంతలం సినిమా రిలీజయ్యాక సమంత స్క్రీన్ మీద ఇలాగే కనిపిస్తే హిట్ అనేది కష్టమే అని కామెంట్స్ వినిపించాయి. ఇలా సమంత బర్త్ డే రోజు విడుదలైన తమిళం చిత్రం, శాకుంతలం ఫస్ట్ లుక్ రెండు నిరాశపరిచాయి.
samantha gives two bad news
సమంత కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. నటిగా సమంత.. రీసెంట్‌గా 12 యేళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ పన్నెండు ఏళ్ల కాలంలో సమంత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సమంత మొదటి తెలుగు సినిమా.. నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ మాయ చేశావే’ ఈ సినిమాలో జెస్సీ..గా సమంత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.