Home » Entertainment » Samantha Interesting Comments About Allu Arjun
Entertainment

Samantha : ‘నా మైండ్ లో నుంచి అల్లు అర్జున్ పోవట్లేదు ‘ — సమంత !!

Authored By
aruna
The Telugu News | Updated on: November 4, 2023, 6:03 pm
Advertisement

Samantha : పుష్ప సినిమాలో ఒక్క పాటతో సమంత సౌత్ ఇండిస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవడం తో సమంత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా సమంత అల్లు అర్జున్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. హాలీవుడ్ సినిమా ‘ మార్వెల్స్ ‘ సినిమాకి దేశవ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఇందులో సూపర్ హీరోలు చేసే విన్యాసాలు, సాహసాలు చూడడానికి జనాలు ఎగబడుతుంటారు. తాజాగా ‘ ది మార్వెల్స్ ‘ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదల కానుంది.

Advertisement

ఇప్పటికే ఇండియాలో ఈ సినిమా ప్రమోషన్స్ గట్టిగానే కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్లో గ్రాండ్ ఈవెంట్ జరిగింది. అందులో సమంత సందడి చేసి మార్వెల్ సినిమాకు సంబంధించి స్పెషల్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో సమంత అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్ వైరల్ అవుతుంది. మీరు కనుక ఒక్కరోజు ఎవెంజర్ అయితే ఎవరితో కలిసి ప్రపంచాన్ని కాపాడుతారు అని యాంకర్ అడగగా దానికి బదులుగా సామ్ ఇంకెవరు నా ఫ్యాన్స్ అని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఎవరు అని అడగగా దానికి సమంత క్రేజీ ఆన్సర్ ఇచ్చింది.

Samantha interesting comments about Allu Arjun

Advertisement

ప్రస్తుతం అల్లు అర్జున్ నా మైండ్ లో నుంచి పోవట్లేదు. సో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ప్రియాంక చోప్రా, అలియా భట్ వీళ్ళతో కలిసి ప్రపంచాన్ని కాపాడుతా అంటూ ఆన్సర్ ఇచ్చింది. దీంతో బన్నీ గురించి సామ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సూపర్ హీరో సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. మార్వెల్ సినిమా ప్రమోషన్స్లో తాను భాగం కావడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది అని తెలిపారు. చెడుపై మంచి సాధించే యుద్ధం కోసం ఈసారి ఒకరు కాదు ఏకంగా ముగ్గురు సూపర్ హీరోలు వస్తున్నారు అని, ఈ యాక్షన్ మూవీ తో దీపావళి స్పెషల్ గా మారనుందని, అందరూ సినిమా ధియేటర్లలో చూడండి అని చెప్పుకొచ్చారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి