Home » Entertainment » Samantha Is Better Than Naga Chaitanya In A Particular Matter
Entertainment

Samantha : ఈ మ్యాటర్‌లో చైతూ కంటే సమంతనే తోపు అంట.. ఎందుకంటే!

Authored By
mallesh
The Telugu News | Published on: September 2, 2022, 4:30 pm
Advertisement

Samantha : టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత నాగ చైతన్య పెళ్లైన నాలుగేళ్లకే విడిపోవడంతో వారి జ్ఞాపకాలను అక్కినేని అభిమానులు ఇంకా గుర్తుచేసుకుంటున్నారు. సెప్టెంబర్ నెల గడిస్తే వారిద్దరూ విడాకులు తీసుకుని ఏడాది అవుతుంది.వీరిద్దరూ విడిపోయి ఏడాది దగ్గర పడుతున్నా వీరి గురించిన టాపిక్ ప్రతిరోజూ నెట్టింట చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా వీరి గురించిన మరో విషయం వైరల్ అవుతోంది.

Advertisement

Samantha : వీరిద్దరిలో సమంతనే బెటరా..

టాలీవుడ్‌లో ఏం మాయ చేశావే సినిమాతో ప్రేమలో పడిన సామ్ చై జంట.. ఆ తర్వాత మనం, మజిలీ మూవీలో నటించి వీరి ప్రేమను పెళ్లివరకు తీసుకెళ్లారు. పెద్దల అంగీకారంతోనే గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి టాలీవుడ్ ప్రముఖులు అందరూ హాజరయ్యారు. అయితే, నాలుగు సంవత్సరాల వరకు హ్యాపీ సాగిన వీరి కాపురం మనస్పర్దల కారణంగా గతేడాది అక్టోబర్‌లో విడాకులు తీసుకున్నారు. ముందుగా సమంత సోషల్ మీడియా వేదికగా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వగా.. చైతూ కూడా అదే వేదికగా మేమిద్దరం విడిపోతున్నామని చెప్పాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్, సినీ ప్రముఖులు చాలా మంది షాక్‌కు గురయ్యారు.

Samantha Is Better Than Naga Chaitanya In A Particular Matter

Advertisement

తండ్రి బాటలోనే తనయుడు నడుస్తున్నాడని అంతా భావించారు.ఇదిలాఉంటే వీరు విడిపోవడానికి ఇంతవరకు కరెక్ట్ రిజన్ ఎవరికీ తెలియదు. తాజాగా వీరిద్దరిలో ఎవరు ఎక్కువగా సంపాదిస్తున్నారన్న విషయంపై నెట్టింట ఓ వార్త వైరల్ అవ్వగా.. సమంతనే చైతూ కంటే ఎక్కువగా సంపాదిస్తున్నదని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే చైతూ కంటే సామ్ చేతిలో ఎక్కువ సినిమాలు ఉన్నాయి. పాన్ ఇండియన్ వెబ్ సిరీస్ తో పాటు హాలీవుడ్ సినిమాలకు కూడా సామ్ సైన్ చేసిందట. ఇక సామ్ చై జంటగా కొనుక్కున్న ప్లాట్‌ను కూడా సామ్ కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి