Home » Entertainment » Samantha Pet In Naga Chaitanya Home
Entertainment

Samantha : నాగచైతన్య వద్ద కనిపించిన సమంత పెంపుడు కుక్క .. దీనిపై నెటిజన్ల ఆరా ..!!

Authored By
aruna
The Telugu News | Published on: October 4, 2023, 11:00 am
Advertisement

Samantha : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య పెళ్లయిన కొన్నాళ్లకే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇప్పటికీ కూడా వారిద్దరు ఎందుకు విడిపోయారు అనేది ఎవరికీ తెలియదు. దీనిపై సమంత, నాగచైతన్యలు కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఇక విడాకుల తర్వాత సామ్, చైతూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. సమంత పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇక నాగచైతన్య స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్ట పడుతున్నాడు.

Advertisement

ఇకపోతే సమంత జంతువు ప్రేమికురాలు అన్న విషయం మనకు తెలిసిందే. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తను పెంచుకుంటున్న కుక్కలతో కలిసి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే చైతు, సామ్ కలిసి ఉన్నప్పుడు హష్ అనే కుక్క ఉండేది. సమంత దానిని ఇంటికి తెచ్చుకొని పెంచుకుంది. చివరికి అది నాగచైతన్యకు బాగా అలవాటు పడిందట. వాళ్ళిద్దరూ కలిసి ఓ షోలో పాల్గొన్నప్పుడు హష్ నాగచైతన్య చుట్టూ తిరుగుతుందని, అతను చెప్పింది చేస్తుందని సామ్ తెలిపింది. అయితే విడాకులు తర్వాత సమంత పెట్స్ ను తనతో పాటు తీసుకెళ్లింది.

Samantha pet in Naga chaitanya home

Advertisement

అయితే తాజాగా నాగచైతన్యకు సంబంధించిన ఓ వీడియోలో హష్ లాంటి కుక్క కనిపించింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. సమంత దగ్గర ఉండాల్సిన కుక్క చైతు దగ్గర ఉంది ఏంటి అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. నాగచైతన్య వద్దకు ఓ అభిమాని కొత్త స్పోర్ట్స్ బైకు తీసుకువచ్చాడు. చైతు ఆటోగ్రాఫ్ కోసం వచ్చాడు. దీంతో చైతు బండి మీద సైన్ చేశాడు. ఆ తర్వాత బండి మీద ఎక్కి ఫోజులు ఇచ్చాడు. ఆ టైంలోనే హష్ కూడా అక్కడ కనిపించింది. దీంతో సమంత దగ్గర ఉండాల్సిన కుక్క చై దగ్గర ఉంది ఏంటి అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. మరోసారి సమంత నాగచైతన్య సోషల్ మీడియాలో ఇలా వైరల్ అవుతున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి