Home » Entertainment » Samantha Reacts About Ear Piercing
Entertainment

Samantha : ఆ నొప్పి త‌గ్గ‌డానికి ఆరు నెల‌ల స‌మ‌యం ప‌ట్టింద‌ని చెప్పిన స‌మంత‌

Authored By
Sam C
The Telugu News | Published on: April 19, 2022, 12:30 pm
Advertisement

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లి కాలంలో సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేసే ర‌చ్చ మాములుగా లేదు. తెలుగులో కొంత కాలం గ్యాప్ తీసుకున్న సమంత ప్రస్తుతం గుణశేఖర్‌ తెరకెక్కిస్తోన్న ‘శాకుంతలం’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తోంది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. దీనితో పాటు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న ‘కాతు వాకుల్ రెండు కాదల్’ అనే తమిళ చిత్రాన్ని కంప్లీట్ చేసేసుకుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా స‌మంత నెటిజ‌న్ల‌తో ముచ్చ‌టించింది. ఈ క్ర‌మంలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది.

Advertisement

ఓ నెటిజన్‌ ఆమె ఇయర్‌ పియర్సింగ్‌ గురించి ప్రశ్నించారు. దీనిపై రియాక్ట్‌ అయిన సామ్‌.. ఈ ప్రశ్న అడిగినందుకు సంతోషం. ఈ ఎయిర్‌ పియర్సింగ్‌ నొప్పి తగ్గడానికి సుమారు 6నెలలు పట్టింది అంటూ చెప్పుకొచ్చింది.థియేటర్ లో చూసిన తొలి చిత్రం ఏదని ప్రశ్నించగా.. జురాసిక్ పార్క్ అని బదులిచ్చింది. ఇక తన తొలి సంపాదన రూ. 500 అట. హోటల్ హోస్టెస్ గా పనిచేసినందుకు ఆ మొత్తం ఇచ్చారట. ఓ అభిమాని సమంతని టాటూల గురించి ప్రశ్నించాడు. మీరు ఎప్పటికైనా వేయించుకోవాలనుకునే టాటూలు ఏంటని అడిగాడు. దీనికి సమంత కాస్త సమయం ఆలోచించుకుని బదులిచ్చింది. ఇక తానూ టాటాలే వేయించుకోకూడదు అనుకుంటున్నట్లు బదులిచ్చింది. తనకు ఆలోచన లేదని సామ్ తెలిపింది. అయితే సమంత ఆల్రెడీ మూడు టాటూలు వేయించుకుని ఉంది.

samantha reacts about ear piercing

Advertisement

Samantha : స‌మంత నొప్పిని భ‌రించిందట‌..!

తెలుగులో సమంత చేతిలో రెండు ఉమెన్ ఓరియెంటెడ్ మూవీస్ ఉన్నాయి. గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం సినిమాతో పాటు యశోద సినిమాలో డిఫరెంట్ రోల్స్ లో నటిస్తోంది సమంత. ఇక తాజాగా శాకుంతలం సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్‌ను షేర్‌ చేసింది సామ్. ఇప్పటికే షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. శాకుంతలం సినిమాకు సంబంధించి డబ్బింగ్‌ పూర్తి చేశానంటూ సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసుకుంది.గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను టీమ్‌వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి