Home » Entertainment » Samantha Revell On Divorce And Affairs
Entertainment

Samantha : నేను పిల్లలు వద్దన లేదు.. నా ఎఫైర్స్ గురించి అడిగే హ‌క్కు మీకేక్క‌ది.. నెటిజ‌న్ల‌పై స‌మంత ఫైర్‌..!

Authored By
mallesh
The Telugu News | Updated on: October 8, 2021 8:18 pm
Advertisement

Samantha: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఉన్న సమంత, నాగచైతన్య విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత Samantha పై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నెగెటివ్ కామెంట్స్ చేస్తూ సమంత కావాలనే నాగచైతన్యకు విడాకులు ఇచ్చిందటూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై చేస్తున్న ట్రోలింగ్‌పై సమంత స్పందించింది.నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత అక్కినేని నాగచైతన్య తనకు పిల్లలు కావాలని అడిగితే, అందుకు సమంత ఒప్పుకోలేదని, ఈ క్రమంలోనే సమంత నాగచైత్యనకు విడాకులు ఇచ్చిందని నెగెటివ్ ప్రచారం జరుగుతోంది.

Advertisement

Samantha Revell on divorce And affairs

ఈ మేరకు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇకపోతే కొందరు అయితే సమంతకు వేరి వారితో ఎఫైర్స్ ఉన్నాయంటూ అందువల్లే నాగచైతన్యకు డైవోర్స్ ఇచ్చిందని అంటున్నారు. సమంత అవకాశవాది అని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంత ట్విట్టర్ వేదికగా స్పందించింది. తాను అవకాశవాదిని కాదని, తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని, వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసి దాడులు చేయొద్దని చెప్పింది. విడాకులు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయమని, ఆ బాధ నుంచి ఇంకా బయటపడలేకపోతున్నానని, ఈ నేపథ్యంలో ఇంకా బాధపడేలా చేయొద్దని కోరింది.

Advertisement

Samantha  : నన్ను ఎవరూ బ్రేక్ చేయలేరు.

Samantha Revell on divorce And affairs

ఈ క్రమంలోనే తాను పిల్లలు వద్దనలేదని స్పష్టం చేసింది సమంత్ రూత్ ప్రభు. అయితే, తన ఎఫైర్స్ గురించి అడిగే హక్కు ఎవరికి లేదని నెటిజన్లపై సమంత ఫైర్ అయింది. ఈ క్రమంలోనే తన ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ బ్రేక్ చేయలేదని సమంత తెలిపింది. సమంత ట్వీట్ పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. సమంతకు తాము మద్దతు ఇస్తున్నట్లు కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే ఇటీవల పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’ షూటింగ్ కంప్లీట్ చేసింది సమంత. గుణశేఖర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో సమంత లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి