Home » Entertainment » Samantha Ruth Prabhu Latest Pic Gets Trolling
Entertainment

Samantha : పక్షవాతం వచ్చిందా? మూతి అలా వంకర పెట్టావ్.. సమంత ఫోటో మీద ట్రోలింగ్

Authored By
aruna
The Telugu News | Published on: August 12, 2023, 3:00 pm
Advertisement

Samantha : సమంత ప్రస్తుతం ఇంట్లో ఎంజాయ్ చేస్తోంది. మొన్నటి వరకు బాలిలో ఎంజాయ్ చేసి వచ్చింది. బాలి అందాలను వీక్షిస్తూ కనిపించింది. ఇప్పుడు సమంత బయటకు రావడం లేదు. చాలా రోజుల తరువాత చిన్మయి ఇంట్లో కనిపించింది. చెన్నైలో సమంత సందడి చేసింది. చిన్మయి పిల్లలతో కలిసి ఆడిపాడింది. ఆ వీడియోలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి. ఇక మొన్న జరిగిన ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సమంత కనిపిస్తుందని అంతా అనుకున్నారు.కానీ ఆ ఈవెంట్‌కు సమంత డుమ్మా కొట్టేసింది.

Advertisement

సమంత తన జిమ్ ట్రైనర్, తన పెట్స్‌తో ఉన్న ఫోటోలను మాత్రం నిత్యం షేర్ చేస్తూనే ఉంది. జిమ్‌లో సమంత బాగానే కష్టపడుతోంది. తాజాగా సమంత కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో తన పెట్స్, తాను ఎలా ఎంజాయ్ చేస్తున్నామనేది, ఎలా చిల్ అవుతున్నామనేది చూపించింది. ఇందులోని ఓ ఫోటో మీద ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతోంది. సమంత మొహం వంకర పెట్టడంతో ట్రోల్ చేస్తున్నారు. ఆ మొహం ఏంటి అలా తిరిగిపోయింది.. వంకరపోయింది.. పక్షవాతం వచ్చిందా? అంటూ ఇలా నానా రకాలుగా ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు.

Advertisement

సమంతకు బాగా లేదని, రెస్ట్ తీసుకుంటోందని, అందుకే ఈవెంట్‌కు రాలేకపోయిందని ఖుషి ట్రైలర్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. సమంత రాకపోయి ఉంటే.. ఇంకో పదేళ్లు అయినా కూడా సినిమా షూటింగ్‌ను ఆపేసేవాళ్లమని విజయ్ చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సమంత ఖుషి సినిమాతో కమ్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి. అసలే ఖుషి సినిమాతో ముగ్గురి జీవితం ముడి పడింది. శివ నిర్వాణ, విజయ్, సమంతలను ఫ్లాపుల్లోంచి బయటపడేసే చిత్రంగా ఖుషి రానుందని అంతా అనుకుంటున్నారు. మరి సెప్టెంబర్ 1న ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి