Samantha : ఇంత సంతోషంగా నేను ఎప్పుడు లేను.. బర్వారాకి కృతజ్ఞతలు అంటూ సమంత పోస్ట్..!
Samantha : రెండేళ్ల క్రితం మయోసైటిస్ బారినపడిన సమంత.. కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది. దాంతో ఇప్పుడిప్పుడే కెరీర్‌పై ఆమె ఫోకస్ పెట్టింది. కానీ.. ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు సమంతని డిస్ట్రబ్ చేశాయి. దానిపై సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందించిన సమంత తిరిగి తన వర్క్‌పై దృష్టి పెట్టింది.సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఇప్పటికీ సమంతనే కొనసాగుతున్నారు. ఆమె వెండితెర మీద కనిపించి సంవత్సరం దాటి పోయింది. అయినా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆరోగ్య సమస్యలతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత..తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. గతంతో పోలిస్తే సమంత ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.
ప్రస్తుతం రాజస్థాన్ లో వివిధ ప్రదేశాలను తిరిగి చూస్తున్న సమంత దీపావళి పండగను కూడా అక్కడే జరుపుకుంది. ఫోర్ట్ బర్వరాలో ఉన్న సమంత అక్కడి ఉద్యోగులతో ఫొటోలు దిగింది. మట్టికుండను తయారుచేసే విధానానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ..తన జీవితంలో ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా ఎప్పుడూ లేనని, ఇప్పుడు ఉన్నానని, నవంబరు నెల మొత్తం ఇంకా ఆనందంగా ఉంటానంటూ చెప్పుకొచ్చింది. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వరా ఎంత అందంగా ఉందో, అంత అద్భుతమైన అనుభవాన్ని కూడా అందించిందని, అందుకు తాను బర్వరాకు కృతజ్ఞతలు అంటూ సమంత తన పోస్ట్‌లో పేర్కొంది.
Samantha : ఇంత సంతోషంగా నేను ఎప్పుడు లేను.. బర్వారాకి కృతజ్ఞతలు అంటూ సమంత పోస్ట్..!
సమంత ప్రస్తుతం ”హనీ బన్నీ” అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్‌తో పాటు సమంత కూడా యాక్షన్ సీక్వెన్స్ చేసినట్టు స్పష్టం అవుతోంది.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.