Home » Entertainment » Samantha Shares Intresting Fact About Naga Chaitranya
Entertainment

Samantha : నాగ చైత‌న్య‌ను స‌మంత ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం వెనుక ఉన్న క‌హానీ ఇదేనా..!

Authored By
Sam C
The Telugu News | Published on: August 13, 2022, 6:00 pm
Advertisement

Samantha : టాలీవుడ్ మోస్ట్ క్రేజీ క‌పుల్స్‌లో స‌మంత‌- నాగ చైత‌న్య జంట ఒక‌టి. 2009లో ‘ఏ మాయ చేసావే’ మూవీ ద్వారా నాగ చైతన్య, సమంతకు ఇద్దరికి పరిచయం అయింది. మనం, మజిలీ వంటి సూపర్ హిట్ సినిమాల్లో ఇద్దరు జంటగా నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2017 అక్టోబర్ 6న చైతూ-సామ్ పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట.. గతేడాది అక్టోబర్ నెలలో విడాకులు తీసుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో సామ్ చేసిన వ్యాఖ్యలు, ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీపై చైతూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

స‌మంత‌.. నాగ చైత‌న్య‌న‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం వెనుక ఒక ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. నా దగ్గర తినడానికి కూడా డబ్బు లేని పరిస్థితి. ఆ టైంలో నన్ను నాగ చైతన్య గారు ఎంతో ఆదుకున్నారు. అంతేకాదు నా దగ్గర మా ఇంటికి ఫోన్ చేయడానికి కూడా ఫోన్ లేని పరిస్థితి. కానీ ఆ టైంలో నాగచైతన్య నాపై చాలా కేర్ తీసుకోవడమే కాకుండా మా అమ్మతో కూడా మాట్లాడించారు అని సమంత చెప్పుకొచ్చింది. నాగచైతన్య పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అంటూ ఆ ఇంటర్వ్యూ లో సమంత పొగిడింది. నాగచైతన్య చూపించిన ప్రేమ, కేర్ వల్ల అతనితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది సమంత.

samantha shares intresting fact about naga chaitranya

Advertisement

ఇద్ద‌రు ఒక‌రిపై ఒకరు తెగ ప్రేమను కురిపించుకోగా, వారిద్ద‌రు స‌డెన్‌గా విడాకులు ఎందుకు తీసుకున్నార‌నేది ఎవ‌రికి అంతుబ‌ట్టని ప్ర‌శ్న‌గా మారింది. ఇటీవ‌ల ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీ గురించి నాగ చైతన్యను ప్రశ్నించగా.. సామ్‌తో తనకు ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీ బాగుంటుందని చెప్పాడు. తమ ఇద్దరి మధ్య సూపర్ హిట్ లవ్ స్టోరీలు వచ్చాయని అన్నాడు. సాయి పల్లవితో కూడా ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీ బాగుంటుందన్నాడు. సాయి పల్లవితో కలిసి లవ్ స్టోరీ మూవీ చేశానన్నాడు. కాగా గతంలో బంగార్రాజు మూవీ ప్రమోషన్లలో కూడా సమంతతో ఆన్ స్క్రీన్ బెస్ట్ కెమిస్ట్రీ అంటూ చైతూ చెప్పిన విషయం తెలిసిందే.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి