Home » Entertainment » Samantha Stops Shootings For 2 Months To Go To Usa
Entertainment

Samantha : రెండు నెల‌లు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన అమెరికాకి స‌మంత ప‌య‌నం.. ఎందుకు?

Authored By
Sam C
The Telugu News | Published on: September 21, 2022, 4:30 pm
Advertisement

Samantha: అతి త‌క్కువ స‌మ‌యంలోనే ద‌క్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల ముద్దుగుమ్మ స‌మంత‌. కెరీర్‌లో దూసుకుపోతున్న ఈ అమ్మ‌డు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర్కొంటుంది. నాగ చైత‌న్య నుండి విడిపోయిన తర్వాత స‌మంత పూర్తిగా ఆధ్యాత్మిక ప్ర‌యాణాలు చేస్తుంది. అంతేకాదు సోష‌ల్ మీడియాలో విచిత్ర పోస్ట్‌లు పెడుతూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. అయితే స‌మంత త్వ‌ర‌లో రెండో పెళ్లి చేసుకోబోతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. స‌ద్గురు సూచ‌న‌ల ప్ర‌కారం సమంత ఓ వ్యక్తిని చేసుకోనుంద‌ని ఇన్‌సైడ్ స‌మాచారం.

Advertisement

Samantha : ఫారెన్ టూర్ ఎందుకో..

ఇక స‌మంత రెండు నెల‌ల పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి అమెరికాకి వెళ్లిన‌ట్టు తెలుస్తుంది. ఇటీవ‌ల స‌మంత‌కు కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. మెహంపై చిన్న చిన్న బొడిపెల్లాంటివి రాగా, అవి చూడ‌డానికి ఇబ్బందిగా త‌యార‌య్యాయి. అందుకే స‌మంత కొన్ని రోజులుగా షూటింగుల‌న్నీ ఆపేసింది. ఇప్పుడు అమెరికాలో.. స్కిన్ ఎల‌ర్జీకి సంబంధించిన చికిత్స తీసుకుంటోంద‌ని, చిన్న‌పాటి ఆప‌రేష‌న్ అవ‌స‌ర‌మైంద‌ని తెలుస్తోంది. స‌ర్జ‌రీ అయిన త‌ర‌వాత‌.. స‌మంత అమెరికా నుండి తిరిగి ఇండియాకి వ‌చ్చి ఆ త‌ర్వాత షూటింగ్‌ల‌లో పాల్గొన‌బోతుంద‌ని స‌మాచారం.

Samantha Stops Shootings For 2 Months To Go To USA

Advertisement

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేస్తున్న `ఖుషి` సినిమాకి ఈనెల 5 నుంచి డేట్లు ఇచ్చింది స‌మంత‌. కానీ… షూటింగుకి రాలేదు. దాంతో స‌మంత లేని సీన్లు షూట్ చేసుకొంది చిత్ర‌బృందం. ఈనెల 15 నుంచి షూటింగ్‌కి వ‌స్తాన‌ని స‌మంత మాటిచ్చింది. కానీ.. 15 నుంచి కూడా ఆమె షూటింగుకు రాలేదు. రెండు నెల‌ల త‌ర్వాతే ఈ అమ్మ‌డు షూటింగ్‌లో జాయిన్ అవుతుంద‌ని ఇన్‌సైడ్ టాక్. కాగా, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో సమంత అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంటెన్స్ ఫెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లలో నటించిన తీరు దేశవ్యాప్తంగా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. ఆ తర్వాత సమంతకు బాలీవుడ్‌ నుంచి భారీ ఆఫర్లు వచ్చాయి. ఆ క్రమంలో తాను వ‌రుస సినిమాలు చేస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి