Samantha : Big Breaking భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సమంత.. ఫస్ట్ టైం రివీల్ చేసింది..!
Samantha Big Breaking : స్టార్ హీరోయిన్ సమంత Samantha ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతుంది. కొన్నాళ్లుగా ఆమె సోషల్ మీడియాకి దూరంగా ఉంటుండగా సమంతకు ఏమైదని సోషల్ మీడియాలో ఒకటే హడావిడి చేశారు. కానీ ఎప్పుడూ సమంత దానికి సంబందించిన విషయాన్ని బయట పెట్టలేదు. ఇక దాని లాభం లేదని అనుకుందో ఏమో కానీ సమంత తన వ్యాధి ఏంటన్నది చెప్పేసింది. సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుందట.
ఇంతకీ ఈ వ్యాధి లక్షణాలు ఏంటి అంటే మయోసైటిక్స్ అంటే కండాలు బలహీనత అని తెలుస్తుంది. బాడీలో కొన్ని పార్ట్ లు బలహీనంగా మారుతాయి. తల పైకెత్తలేకపోవడం.. శ్వాస తీసుకోకపోవడం.. ఒక్కోసారి మ్రింగటం కూడా బాధపడాల్సి వస్తుందట. మరి ఇది ఆమెకు ఎలా వచ్చిందో కానీ సమంత ఈ వ్యాధి నుంచి త్వరగా బయట పడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. సమంత ఎ వ్యాధి గురించి తన సోషల్ మీడియాలో షేర్ చేసి షాక్ ఇచ్చారు. సమంత ప్రస్తుతం శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తుంది.
samantha suffering with myositis first time revealed
ఈమధ్యనే యశోద ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత సినిమాలో ఆమె యాక్షన్ సీన్స్ తో అదరగొట్టినట్టు తెలుస్తుంది. నవంబర్ 11న పాన్ ఇండియా వైడ్ గా యశోద సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. శాకుంతలం సినిమా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదు.
