Home » Entertainment » Samantha Viral Pics
Entertainment

Samantha : సెగ రేపుతున్న సమంత అందాలు…

Authored By
mallesh
The Telugu News | Published on: December 1, 2021, 2:20 pm
Advertisement

Samantha :  సమంత. ఈ కుందనపు బొమ్మ తమిళనాడులో పుట్టినా కూడా తెలుగు చక్కగా మాట్లాడుతూ కుర్రకారుతో పాటు అందర్నీ తన వైపుకు తిప్పుకుంది. అక్కినేని నాగచైతన్య నటించిన ఏ మాయ చేసావే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అందర్నీ మాయ చేసింది. అలా మొదలయిన సమంత జర్నీ జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. 2010లో సమంత ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికీ కూడా సమంత జోరు ఏ మాత్రం తగ్గలేదు. తెలుగు తెర మీదే కాకుండా తమిళ తెర మీద కూడా సమంత మెరిసింది. అక్కడ కూడా అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. ఏ మాయ చేసావే సినిమాలోని జెస్సీ పాత్రను కుర్రాళ్లు ఇప్పటికీ మరిచిపోలేరు. జెస్సీ పాత్రకు గాను సమంతకు అనేక అవార్డులు వరించాయి. జెస్సీ పాత్రలో సమంత ఒదిగిపోయిన విధానం గురించి ఎవరూ మర్చిపోలేరు.

Advertisement

samantha-viral-pics

Samantha : జోరు చూపెడుతున్న బ్యూటీ..

ఏ మాయ చేసావే సినిమా తర్వాత సమంత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బృందావనం సినిమాలో మెరిసింది. ఈ సినిమాలో సమంత ఇందు అనే క్యారెక్టర్ లో ఇరగదీసింది. ఇక ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావడంతో సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ఆ తర్వాత సమంత సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దీంతో సమంతకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇటీవల సమంత తన వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. సమంత త్వరలో హాలీవుడ్ కు కూడా వెళ్లనుంది. ఆమె ఇటీవల చేసిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ను విమర్శకులు సైతం ప్రశంసించారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి