janaki kalaganaledu 1 december 2021 full episode
Janaki Kalaganaledu 1 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 డిసెంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 183 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ తన ఇద్దరు కోడళ్లను పిలిచి.. మల్లెపూలు పెడుతుంది. దీంతో జానకి చాలా సంతోషిస్తుంది. మల్లిక మాత్రం రేపు జరగబోయే దాని గురించి ఆలోచిస్తుంది. రేపు జానకి పని అయిపోతుంది అని అనుకుంటుంది. కట్ చేస్తే.. రామా.. జానకి ఐపీఎస్ కల గురించే ఆలోచిస్తుంటాడు. జానకి ఐపీఎస్ కలను ఎందుకు వదిలేసుకుందో అని ఆలోచిస్తుంటాడు.
janaki kalaganaledu 1 december 2021 full episode
తను ఐపీఎస్ కాకపోతే తనకు ఎక్కడ దూరం అవుతుందో అని భయపడతాడు. ఇంతలోనే జానకి వస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటాడు రామా. ఏమైందండి అంటుంది జానకి. మీ ఐపీఎస్ కలను ఎందుకు వదిలేసుకున్నారు.. అభి పంపించిన పుస్తకాలను ఎందుకు పంపించారు.. అని అడుగుతాడు. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు నామాటే మీరు వినాలి. మన మధ్య ఈ విషయం గురించి ఇంకోసారి చర్చ రాకూడదు. నా మనసును బాధపెట్టకండి. ఇప్పటి వరకు నేను మోసిన దు:ఖం చాలు. ఇంకా ఇంకా దు:ఖాన్ని మోసే శక్తి ఈ గుండెకు లేదు.
ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో అనుభవించిన నాకే తెలుసు. మరోసారి నాకు ఆ నరకం వద్దు. నా కల కోసం నావాళ్లను నా కుటుంబాన్ని నేను దూరం చేసుకోలేను. దయచేసి మీ భార్య బాధను అర్థం చేసుకోండి ప్లీజ్ అంటుంది జానకి. దీంతో రామాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు.బాధేస్తోంది జానకి గారు. మా అమ్మ కోసం మా కుటుంబం కోసం మీ ప్రాణానికి ప్రాణమైన కలను త్యాగం చేస్తుంటే బాధగా ఉంది. మేము సంతోషంగా ఉండాలని మీ దు:ఖాన్ని బయటికి కనబడనీయకుండా దాచుకోవడం మరింత బాధగా ఉంది. అన్నింటికి మించి నా భార్య కలను గెలిపించలేకపోతున్నాని నా మీద నాకే కోపంగా ఉంది అని అనుకుంటాడు రామా.
కట్ చేస్తే రామా.. తన తల్లి దగ్గరికి వెళ్లి తన కాళ్ల మీద పడుకుంటాడు. తను నిద్రలేచి ఏమైంది నాన్నా అంటుంది. అలా కాళ్ల దగ్గర తల పెట్టి కూర్చున్నావేంటి.. ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదమ్మా ఎందుకు కాసేపు నీ కాళ్ల మీద తల పెట్టి పడుకోవాలనిపించింది అంటాడు రామా.
నీ మనసులో ఏం బాధ ఉందిరా. నీ మనసులో ఏం బాధ ఉందో చెప్పు అంటుంది జ్ఞానాంబ. బాధలేముంటాయమ్యా.. మరిచిపోవడం.. వద్దనుకోవడం.. వదిలేయడం.. అన్నీ జరిగిపోయాయి కదా ఇక బాధ ఎందుకు ఉంటుంది అమ్మ అంటాడు రామా.కట్ చేస్తే ఉదయమే సునంద బర్త్ డే వేడుకలకు జ్ఞానాంబ కుటుంబం వెళ్తుంది. అమ్మ ఆ రామా గాడు అంటే నాకు పడదు అని తెలుసు కదా.. ఆ స్వీట్ షాపు వాళ్లను ఎందుకు పిలిచావు అంటాడు సునంద కొడుకు. అవసరంరా.. వాళ్ల దగ్గర సగం ఓట్లను శాసించే మంచితనం ఉంది. అందుకే తనను కాకా పట్టాలి అంటుంది సునంద.
అందరినీ పలకరిస్తుంది సునంద. ఇంతలోనే పోలీసులు వస్తారు. ఏమైంది అని అడుగుతుంది సునంద. ఫుడ్ ఇన్ స్పెక్టర్ కూడా వస్తారు. ఇక్కడ జ్ఞానాంబ అంటే ఎవరు అని అడుగుతాడు ఎస్ఐ. నేనే అని అంటుంది జ్ఞానాంబ. ఎందుకు అని అడుగుతుంది. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటాడు ఎస్ఐ. దీంతో అందరూ షాక్ అవుతారు.
రఘురామ్ వచ్చి అసలు విషయం చెబుతాడు. వీళ్లింట్లో ఫంక్షన్ కు మీ షాపు నుంచి పూతరేకులు పంపించారు కదా. అవి తిన్నవారిలో 10 మంది ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు.. అంటూ ఎస్ఐ అసలు నిజం చెబుతాడు. దీంతో జ్ఞానాంబను అరెస్ట్ చేయబోతారు. మీరు కార్పొరేటర్ కదా.. మీరైనా చెప్పండి అని రామా.. సునందను కోరుతాడు కానీ.. ఇది పెద్ద కేసు.. నేను చెప్పినా వినరు అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్‌డమ్' kingdom movie . గౌతమ్…
Copper Water Bottles : కాపర్ బాటిల్ వాడేటప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నిమ్మకాయ నీరు, జ్యూస్ లేదా…
This website uses cookies.