Home » Entertainment » Samantha Viral Post She Says Inner Peace Is The New Success
Entertainment

Samantha : అదే నిజమైన సక్సెస్.. సమంత కామెంట్స్ వైరల్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: November 5, 2021 5:03 pm
Advertisement

Samantha : నాగ చైతన్యతో విడాకుల సమయంలో సోషల్ మీడియాకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన సమంత.. ఇప్పుడు మరోసారి తన పోస్ట్‌లతో రెచ్చిపోతుంది. ఏదో విధంగా వార్తలో నిలుస్తోంది. తన టూర్స్‌కు సంబంధించిన ఫొటోలతో పాటు లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేస్తోంది. సూక్తులను కూడా పోస్ట్ చేస్తుంది. అయితే ఆమె చేసే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఆమె చేసే పోస్టుల వెనక ఉద్దేశం ఇదే అంటూ నెటిజన్లు ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Samantha Viral Post She says inner peace is the new success

తాజాగా ఆమె చేసిన ఇన్‌స్టా స్టేటస్ వైరల్ అవుతోంది. అందులో ధనవంతులు, సక్సెస్, సంపద, ప్రశాంతతకు అర్థాలు చెప్పింది. అయితే ప్రతి దాని ముందు కొత్త అనే పదం జోడించింది. ‘ఆనందమనేది నిజమైన ధనం. మానసిక ప్రశాంతత అనేది నిజమైన సక్సెస్ విజయం. ఆరోగ్యమే నిజమైన సంపద. జాలి అనేదే నిజమైన ప్రశాంతత’ అని సమంత పేర్కొంది. మొత్తానికి సమంత మాత్రం ఇలాంటి వింత కొటేషన్లను చెబుతూ వస్తోంది.

Advertisement

Samantha : సమంత వింత కొటేషన్..

samantha viral pic

అయితే తన పోస్ట్‌లో ప్రతి వ్యాఖ్యంలో కొత్త(new) అనే పదాన్ని సమంత చేర్చింది. దీంతో సమంత చేసిన పోస్ట్ వెనకాల పెద్ద అర్థమే ఉందని.. నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆమె ఇప్పుడు ఆనందంతో, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తుందని.. దాని అర్థం అదే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా సమంత వరుస పోస్టుల‌తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే ఆమె చేస్తున్న కొన్ని పోస్టుల వెనక అర్థాలేమిటో ఆమెకే తెలియాలి. ఇక, సినిమాల విషయానికి వస్తే.. సమంత కెరీర్‌ విషయంలో వేగం పెంచింది. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లతో పాటు, కొత్త చిత్రాల విషయంలోనూ దూకుడు ప్రదర్శిస్తుంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి