22A Lands : ప్రైవేట్ భూములకు గుడ్‌న్యూస్.. 22ఏ భూములపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on: September 16, 2026, 12:58 pm
  •  22A Lands తెలంగాణలో 22ఏ భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. 22ఏ జాబితాలో భూములు ఉన్న ప్రైవేట్ యజమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం

22A Lands : తెలంగాణలో 22ఏ భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. 22ఏ జాబితాలో భూములు ఉన్న ప్రైవేట్ యజమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు భూముల యజమానులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వారి భూములు 22ఏ జాబితాలో ఉన్నప్పటికీ, అది నిజంగా ప్రైవేట్ భూమి అని తేలితే రిజిస్ట్రేషన్‌ను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.22ఏ భూముల సమస్యపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించడం తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. భూముల యజమానులు తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునే విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

22A Lands : ప్రైవేట్ భూములకు గుడ్‌న్యూస్.. 22ఏ భూములపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన..!

22A Lands : ప్రైవేట్ భూములకు గుడ్‌న్యూస్.. 22ఏ భూములపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన..!

22A Lands : 22ఏ జాబితాలో ఉన్నా.. ప్రైవేట్ భూమి అయితే రిజిస్ట్రేషన్

రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వ్యక్తి భూమి 22ఏ జాబితాలో ఉన్నట్లయితే, సంబంధిత రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో ఆ భూమిని పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పరిశీలనలో అది ప్రైవేట్ భూమిగా నిర్ధారణ అయితే ఎలాంటి ఆలస్యం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దీంతో 22ఏ జాబితాలో పేరు ఉండటంతో తమ భూముల రిజిస్ట్రేషన్ నిలిచిపోతుందేమోనని ఆందోళన చెందుతున్న యజమానులకు ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లయింది.

అదే సమయంలో 22ఏ జాబితాలో ఉన్న భూములను జిల్లా కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించాలని సీఎం ఆదేశించారు. భూముల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం సరైన జాబితాను రూపొందించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశీలనను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

22A Lands పుకార్లను నమ్మొద్దు.. దళారులను ఆశ్రయించొద్దన్న సీఎం

22ఏ భూముల విషయంలో ప్రజలు ఎలాంటి వదంతులు, కట్టుకథలను నమ్మవద్దని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. భూ హక్కుల విషయంలో అనవసర ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఆసరాగా చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సూచించారు.ప్రజల ఆస్తి హక్కులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ప్రైవేట్ భూములకు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. 22ఏ జాబితాలో ఉన్న భూముల విషయంలో వాస్తవాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని, ప్రైవేట్ భూమి అని నిర్ధారణ అయితే రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  2. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  3. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  4. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  5. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  6. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  7. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp