Home » Entertainment » Samantha Will Also Act In Those Scenes If She Liksit
Entertainment

Samantha : అది ఒక్కటి నచ్చితే చాలట.. సమంత ఎవరితో అయినా రొమాన్స్ చేస్తుందట

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 4, 2023, 5:43 pm
Advertisement

Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత తెలుసు కదా. తను ఇప్పుడు ఏకంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది. నిజానికి.. సమంత పెళ్లి అయి విడాకులు తీసుకున్నా తన కెరీర్ మాత్రం పైకి ఎగబాకుతోంది. దాదాపు 15 ఏళ్ల నుంచి తెలుగులో తను స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నిజానికి.. తనది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. డబ్బుల కోసం యాడ్స్ లో నటించింది. మోడలింగ్ చేసింది. చివరకు సినిమాల్లోకి వచ్చి స్టార్ డమ్ ను సంపాదించుకుంది సమంత.

Advertisement

అయితే.. సమంత జీవితం ఇన్నేళ్లలో చాలా మలుపులు తిరిగింది. నిజానికి తనకు ఒక హీరోయిన్ గానే కాదు.. సేవలోనూ ముందుంటుంది. ఎన్నో సేవా కార్యక్రమాల్లో తను ఇప్పటి వరకు పాల్గొన్నది. ఇటీవల తనకు ఒక అరుదైన వ్యాధి సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకుంటోంది సమంత. అయితే.. సమంత చేసే ఎన్నో మంచి పనులను, సేవా కార్యక్రమాలను పక్కన పెట్టి.. తను వేసుకునే డ్రెస్సులు, సినిమాల్లో తను చేసే రొమాన్స్ నే జనాలు చూస్తున్నారు. వాటిని చూసి సమంతపై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.

samantha will also act in those scenes if she liksit

Advertisement

Samantha : తెలుగుతో పాటు తమిళాన్ని కూడా ఏలిన సమంత

తెలుగుతో పాటు తమిళంలోనూ సమంత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చాలా ఏళ్ల పాటు తను తమిళం, తెలుగు ఇండస్ట్రీలను ఏలింది. టాప్ హీరోలతో నటించింది. అయితే.. సమంత రొమాంటిక్ సీన్లలో నటించడానికి ఏమాత్రం మొహమాట పడదు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ చూసే ఉంటారు కదా. అందులో తనది చాలా బోల్డ్ క్యారెక్టర్. హాలీవుడ్ లోనూ తను నటించింది. అందులో లెస్బియన్ క్యారెక్టర్ లో నటించింది సమంత. అయితే.. తనకు పాత్ర నచ్చితే అలాంటి క్యారెక్టర్ లో చేయడానికి ఎలాంటి మొహమాటపడదని చాలాసార్లు పలు ఇంటర్వ్యూలలోనూ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి