
samantha yashoda teaser released
Samantha : సమంత.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో ఒకరు. ఈ అమ్మడు ఇప్పుడు వరసపెట్టి సినిమాలు చేస్తుంది.‘ఏమాయ చేశావే’ సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ బ్యూటీ రీసెంట్‌గా ‘కతు వాకుల రెండు కాదల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈమె తెలుగులో మూడు సినిమాలలో నటిస్తుంది. అందులో యశోద ఒకటి. హరీ, హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న గతేడాది షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. తాజాగా చిత్రబృందం ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేసింది.శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక క్రిష్ణ ప్రసాద్.. యశోద సినిమాను నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న యశోద సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ లో సమంత.. ఆసుపత్రి బెడ్‌పై సమంత ఉన్న సీన్‌తో యశోద సినిమా ఫస్ట్ గ్లింప్స్ మొదలవుతుంది. యశోద ఫస్ట్ గ్లింప్స్ నిడివి 36 సెకండ్లుగా ఉంది. హాస్పిటల్ బెడ్‌పై కళ్లు తెరిచిన సమంత.. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉంటుంది. చేతికి ఉన్న బ్యాండ్ చూసుకుని.. నెమ్మదిగా బెడ్‌పై నుంచి కిందికి దిగి బయట ప్రపంచాన్ని చూడడానికి కిటికీ వద్దకు వస్తుంది. కిటికీలోంచి చేయి పెట్టి అక్కడ ఉన్న పావురాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో వీడియో పూర్తవుతుంది.హరి – హరీష్ దర్శకులుగా శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
samantha yashoda teaser released
వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘‘సమంతకు ‘ది ఫ్యామిలీ మేన్’ సిరీస్ సీజన్ 2 ఎంత పేరు తెచ్చిందో మనకు తెలుసు. ఆమె రేంజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంకా బెటర్‌గా ఉండేలా యశోద సినిమాను రూపొందించాం. ఈ సినిమాలో సమంత తన పాత్రను క్యారీ చేసిన తీరు చూస్తే చాలా గర్వంగా అనిపించింది. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. జూన్ మొదటి వారానికంతా ‘యశోద’ షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న భారీ ఎత్తున విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు.
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10…
Bananas : అరటిపండును 'ప్రకృతి ప్రసాదించిన శక్తి బాంబు' ( Energy Bomb ) అని పిలవవచ్చు. తక్కువ ధరలో…
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్…
Virat Kohli : ఇటీవల ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, ఏడాది ముగిసే సరికి…
Black Cumin : చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మన శరీరం వేడి కోసం వేయించిన మరియు అధిక…
Alcohol : న్యూమరాలజీ ( Numerology ) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా,…
Lemon Tea Benefits : టీ Tea అనగానే చాలామందికి పాల టీ గుర్తుకు వస్తుంది. అయితే ప్రతి ఒక్కరి…
This website uses cookies.