Home » Entertainment » Santhosh Varkey Response On Nithya Menen Comments
Entertainment

Nithya Menen : ఇదెక్క‌డి వివాదం.. చ‌చ్చినా కూడా నిత్యామీన‌న్‌ని పెళ్లి చేసుకోను

Authored By
Sam C
The Telugu News | Published on: August 7, 2022, 8:40 pm
Advertisement

Nithya Menen : నిత్యా మీన‌న్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అనేక ర‌కాలుగా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న నిత్యా మీన‌న్ తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. స్కిన్ షో అనే మాటకి చాలా దూరంగా ఉంటూనే ఆమె తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. మలయాళ సినిమా ద్వారా నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన నిత్యామీనన్ ఆ తరువాత కన్నడ .. తెలుగు .. తమిళ భాషల్లో అడుగుపెట్టింది.వివాదాలకు, రూమర్స్ కి నిత్యా మీనన్ దూరంగా ఉంటుంది. కానీ ఇటీవల నిత్యా మీనన్ ని వరుస రూమర్స్ చుట్టుముడుతున్నాయి. నిత్యామీనన్ త్వరలో ఓ స్టార్ హీరోని వివాహం చేసుకోబోతోంది అంటూ ప్రచారం జరిగింది. ఆ రూమర్స్ పై నిత్యామీనన్ స్వయంగా క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ లో నిజం లేదని.. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని తేల్చేసింది.

Advertisement

Nithya Menen : ప్రేమ వివాదం..

ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన పెళ్లిపై జరిగిన ప్రచారంపై ఆమె స్పందించింది. సంతోష్‌ వర్కీ తనకు 30కి పైగా నంబర్స్‌ నుంచి కాల్‌ చేస్తూ విసిగించేవాడని పేర్కొంది. తాజాగా తనపై నిత్యామీనన్‌ చేస్తున్న ఆరోపణలపై సంతోష్‌ వర్కీ స్పందించాడు. ఇందులో వాస్తవం లేదని, ఒకే వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్‌కార్డులు కొనగలడో జనాలకే వదిలేస్తున్నాడని చెప్పాడు. నిత్యామీనన్‌కు వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని వాళ్ల తల్లి చెబితే, జరగలేదని తండ్రి చెప్పారు. అంతేకాకుండా వాళ్లు నాపై లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టాలని చూస్తున్నారు.

Santhosh varkey Response on Nithya Menen Comments

Advertisement

గతంలో నిత్యామీనన్ తల్లి.. తమ కుమార్తెకు ఆల్రెడీ వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది అని చెప్పింది. వాళ్ళ తండ్రి ఏమో అలాంటిది ఏమి లేదని చెప్పాడు. ఇక నాపై లైంగిక వేధింపుల కేసు పెట్టేందుకు కూడా ప్రయత్నించారు. గతంలో నేను నిత్యామీనన్ ని ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాను. ఇప్పుడు ఆమె గురించి తెలిసింది. ముందే ఈ విషయాలు తెలిసుంటే ఆమెని ప్రేమించేవాడిని కాదు. ఇక ఆమెని చచ్చినా వివాహం చేసుకోను అని సంతోష్ ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేశారు. సంతోష్ వర్కీ మలయాళంలో యూట్యూబర్. నిత్యామీనన్ పై కామెంట్స్ తో ఒక్కసారిగా వైరల్ గా మారాడు. మ‌రి ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో అని అంద‌రు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి