Sekhar Master Is Chaeted Money In Real Estate
Sekhar Master : శేఖర్ మాస్టర్ అనే పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై శేఖర్ మాస్టర్ తన ముద్ర వేశాడు. ఢీ షోకు జడ్జ్‌గా, జబర్దస్త్ షోల్లో నవ్వులు పూయిస్తూ స్కిట్లు వేస్తూ ఆకట్టుకున్నాడు.అలా శేఖర్ మాస్టర్‌కు బుల్లితెర మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. అందరికీ తెలిసి వచ్చేలా చేసింది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. ఇక వెండితెరపై స్టార్ హీరోలకు అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. మాస్ సాంగ్ అయినా క్లాస్ సాంగ్ అయినా కూడా శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తే అదిరిపోవాల్సిందే. అలా శేఖర్ మాస్టర్ అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా బాగానే సంపాదించేస్తున్నాడు. అంతే కాకుండా శేఖర్ స్టూడియో అని పెట్టి.. యూట్యూబ్‌లో వీడియోలతో సంపాదిస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్‌లను నిర్మిస్తున్నాడు.
ఇలా ఇంత కష్టపడి సంపాదిస్తున్న శేఖర్ మాస్టర్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటకు చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. తాను మోసపోయిన తీరు, పోయిన డబ్బు గురించి చెబుతూ బాధపడ్డాడు. మరీ అంత దగ్గరి వాళ్లు కాదంటూ చెప్పుకొచ్చాడు. తనకు తెలిసిన వాళ్లే.. ఒకరిని పరిచయం చేశాడు. హైద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రూట్‌లో ఉంది.. మంచి వ్యాల్యూ ఉంది.. ఇంకా వస్తుంది అని చెప్పారు. దీంతో నేను కూడా మన వాళ్లే కదా? అని ఇచ్చాను. బయటి నుంచి అప్పు తెచ్చి మరీ ఇచ్చాను. ఆ మధ్య లాక్డౌన్, కరోనా వచ్చాయి..
Sekhar Master Is Chaeted Money In Real Estate
దాన్ని అమ్మేసి..కాస్త అప్పు తీర్చేద్దామని అనుకున్నాను.. అయితే ఇదే మాట వాళ్లకి చెప్పాను.. ఇప్పుడు కరోనా వల్ల రేట్ తగ్గిందండి అన్నారు. అయినా పర్లేదు ఎంత వస్తే అంతే ఇవ్వండి అని అన్నాను.. అలా ఆలస్యం చేస్తూనే వచ్చారు. ఇప్పటికీ రెండేళ్లు అవుతున్నాయి.. ఇప్పుడు వాళ్లు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు.. నేను కష్టపడ్డ సొమ్ము కదా? అండి.. తండ్రి సంపాదించి ఏమీ ఇవ్వలేదు.. నేను కష్టపడి అక్కడా ఇక్కడా అప్పు చేసి తెచ్చాను. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అలా పోయిందంటూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు.
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
This website uses cookies.