Home » Entertainment » Sekhar Master Sahithi Vinni At Dubai Vacation
Entertainment

Sekhar Master : శేఖర్ మాస్టర్ కూతురు దుబాయ్‌లో పొట్టిబట్టల్లో రచ్చ..!

Authored By
aruna
The Telugu News | Published on: June 3, 2022, 4:30 pm
Advertisement

Sekhar Master : శేఖర్ మాస్టర్ బుల్లితెరపై ఎంత బిజీగా ఉంటున్నాడో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై చేస్తూనే.. వెండితెరపై తన అవకాశాలను కాపాడుకుంటున్నాడు. అలా రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక ఇప్పుడు కాస్త బుల్లితెరపై హంగామా తగ్గించాడు. ఈటీవీలో ఢీ చేస్తోన్న సమయంలో అయితే జబర్దస్త్ షోతో పాటు పండుగ ఈవెంట్లు కూడా చేసేవాడు. ఇక ఇప్పుడు స్టార్ మాలో కాస్త తగ్గించాడు. ఏదైనా స్పెషల్ ప్రోగ్రాం ఉంటే చేస్తున్నాడు. లేదంటే తన సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నాడు. అసలే టాప్ కొరియోగ్రాఫర్‌గా శేఖర్ మాస్టర్ దూసుకుపోతోన్నాడు.

Advertisement

శేఖర్ మాస్టర్ తన కొడుకు విన్ని, కూతురు సాహితిని బుల్లితెరకు బాగానే అలవాటు చేశాడు. కామెడీ షోలు, డ్యాన్స్ షోలు, పండుగ ఈవెంట్లు అంటూ సాహితి, విన్నీని బాగానే పరిచయం చేశాడు. ఆ ఇద్దరికీ జనాల్లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ ఇద్దరూ కలిసి చేసే అల్లరిని యూట్యూబ్‌లోనూ వీడియో రూపంలో షేర్ చేస్తుంటాడు. శేఖర్ స్టూడియో అనే యూట్యూబ్ చానెల్‌లో తన కూతురు, కొడుకు వీడియోలుంటాయి. శేఖర్ మాస్టర్ తన కూతురు సాహితి, కొడుకు విన్నిల గురించి ఎన్నెన్నో విషయాలు అక్కడ చెబుతుంటాడు.

Sekhar Master Sahithi Vinni At Dubai Vacation

Advertisement

ఇక శేఖర్ మాస్టర్ కూతురు సాహితికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు.అందుకే ఆమె పేరుతో ఎలాంటి ఐడీ కనిపించినా జనాలు ఫాలో అవుతుంటారు. అందరూ ఫేక్ ఐడీ క్రియేట్ చేస్తున్నారని, తన కూతురికి దగ్గరుండి ఇన్ స్టా గ్రాం అకౌంట్ ఐడీని క్రియేట్ చేశాడు శేఖర్ మాస్టర్. అలా సాహితి ఫాలోయింగ్ క్రేజ్ మామూలుగా పెరగడం లేదు. ఇక ఈ మధ్య సాహితి పొట్టి బట్టల్లో కనిపిస్తోంది. మోడ్రన్ డ్రెస్సులు అంటూ హంగామా చేస్తోంది. తాజాగా ఈ ఫ్యామిలీ అంతా కూడా దుబాయ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. కాసేపటి క్రితమే శేఖర్ మాస్టర్ తన దుబాయ్ వెకేషన్ ఫోటోలను షేర్ చేశాడు. అందులో శేఖర్ మాస్టర్ ఫ్యామిలీ ఫుల్ ఖుషీగా కనిపిస్తోంది. ఇక సాహితి మాత్రం అందరిలోనూ స్పెషల్‌గా కనిపించింది. అయితే ఇది ఫ్యామిలీ టూరా? లేదా? ఏదైనా సినిమాకు సాంగ్స్ కంపోజ్ చేసే భాగంలో అలా వెళ్లాడా? అన్నది చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి