Home » Entertainment » Senior Actress Vatsala Rajagopal Passes Away
Entertainment

Vatsala Rajagopal : టాలీవుడ్‌లో విషాదం.. ‘రోజా’, ‘అదుర్స్’ ఫేమ్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూత..!

Vatsala Rajagopal : తెలుగు, తమిళ ప్రేక్షకులకు తన సహజమైన నటనతో ఎంతో చేరువైన సీనియర్ నటీమణి వత్సల రాజగోపాల్ (92) ఇక లేరు. గత కొంతకాలంగా…
Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: October 30, 2026, 5:52 pm
Advertisement

Vatsala Rajagopal : తెలుగు, తమిళ ప్రేక్షకులకు తన సహజమైన నటనతో ఎంతో చేరువైన సీనియర్ నటీమణి వత్సల రాజగోపాల్ (92) ఇక లేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని పల్లాపురంలో ఉన్న తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దశాబ్దాల పాటు తనదైన అభినయంతో ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసిన ఈ బామ్మ మరణవార్త సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ప్రస్తుతం ఆమె నివాసంలోనే ఉంచారు.

Advertisement

Vatsala Rajagopal : టాలీవుడ్‌లో విషాదం.. ‘రోజా’, ‘అదుర్స్’ ఫేమ్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూత..!Vatsala Rajagopal : టాలీవుడ్‌లో విషాదం.. ‘రోజా’, ‘అదుర్స్’ ఫేమ్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూత..!

Vatsala Rajagopal ‘అదుర్స్’ బామ్మగా తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం

వత్సల రాజగోపాల్ అసలు పేరు చెబితే సామాన్య ప్రేక్షకులకు వెంటనే గుర్తురాకపోవచ్చు కానీ.. ‘అదుర్స్ సినిమాలో చారి (ఎన్టీఆర్) బామ్మ’ అనగానే ఆ ముఖం టక్కున గుర్తొస్తుంది. 2010 జనవరి 13న ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో, వల్లభనేని వంశీ మోహన్ నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్, నయనతార జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘అదుర్స్’. ఈ చిత్రంలో తనికెళ్ల భరణికి తల్లిగా, ఎన్టీఆర్ కు బామ్మగా ఆమె పండించిన హాస్యం, చూపించిన హావభావాలు తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్నాయి. తనదైన టైమింగ్ తో జూనియర్ ఎన్టీఆర్ కు ధీటుగా నటించి అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

60 ఏళ్ల వయసులో ఇండస్ట్రీ ఎంట్రీ.. నాటకాల నుంచి వెండితెర దాకా ప్రయాణం!

సాధారణంగా నటీనటులు తమ యవ్వనంలో ఇండస్ట్రీకి పరిచయం అవుతారు. కానీ వత్సల రాజగోపాల్ జీవితం భిన్నమైనది. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఆమెకు.. పాఠశాల దశ నుంచే నృత్యం, నాటక రంగాలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. నాటకాల్లో చురుకుగా పాల్గొంటున్న సమయంలోనే వివాహం జరిగింది. ఆ తర్వాత 1953లో భర్తతో కలిసి చెన్నైకి మకాం మార్చారు. అక్కడ ఓ క్లర్కుగా ఉద్యోగం సాధించినప్పటికీ, కళపై ఉన్న మక్కువతో నాటక ప్రదర్శనలు ఇస్తూనే ఉండేవారు. సరిగ్గా ఆ సమయంలోనే ప్రముఖ లెజెండరీ దర్శకుడు మణిరత్నం కంట్లో పడ్డారామె. ఆయన ప్రోత్సాహంతో 1992లో వచ్చిన సెన్సేషనల్ హిట్ ‘రోజా’ చిత్రం ద్వారా తన 60వ ఏట వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో హీరోయిన్ మధుకు అమ్మమ్మగా నటించి తన తొలి అడుగులోనే గొప్ప మార్కు వేశారు. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. సతి లీలావతి, రిథమ్, విన్నర్, పట్టియల్, ధామ్ ధూమ్, కళ్యాణ సమయల్ సాదం వంటి సూపర్ హిట్ సినిమాలతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఏకంగా 400కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.

Advertisement

Also Read :  AP Local Elections : 13 మేయర్ పీఠాలపై కూటమి గురి.. వైసీపీ ఆశలు ఎక్కడంటే?

కేవలం వెండితెరకే పరిమితం కాకుండా.. బుల్లితెరపైనా తనదైన ముద్ర వేశారు వత్సల. చిత్తి, వసంతం, ఆనందం, ముంధనై ముడిచ్చు లాంటి ఎన్నో తమిళ, మలయాళ సీరియల్స్‌లో నటించి టీవీ ప్రేక్షకులకు సైతం ఆత్మీయురాలిగా మారారు. వయోభారంతో ఆమె కన్నుమూయడం పట్ల నెటిజన్లు, అభిమానులు, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు Vatsala Rajagopal, Adhurs bamma, Roja movie actress death, Tollywood news, Tamil actress Vatsala passes away

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి