Home » Entertainment » Shakuntalam Team Is Warned By Requesting
Entertainment

 Shakunthalam: శాకుంతలం టీం రిక్వెస్ట్ లాంటి వార్నింగ్ ..?

Authored By
vamana sai
The Telugu News | Updated on: January 21, 2021 10:06 am
Advertisement

Shakunthalam: శాకుంతలం .. సమంత అక్కినేని కావ్య నాయకి గా నటించబోతున్న లేటెస్ట్ సినిమా. జాను లాంటి భారీ డిజాస్టర్ తర్వత మళ్ళీ ఇన్నాళ్ళకి సమంత ఒక సర్‌ప్రైజింగ్ ప్రాజెక్ట్ తో రాబోతోంది. ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గుణ టీం వర్క్ బ్యానర్ లో గుణ శేఖర్ కూతురు నీలిమ గుణ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. మహాభారతంలోని ఓ అద్భుత ఘట్టం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు గుణ శేఖర్. ఇక గుణ శేఖర్ అంటేనే భారీ సెట్స్ గుర్తొస్తాయి. అలాగే శాకుంతలం సినిమాకి భారీ సెట్స్ ని నిర్మిస్తున్నారు.

Advertisement

 

shakuntalam team is warned by requesting

Advertisement

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ తో పాటు ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ సాగుతోంది. ఈ క్రమంలోనే శాకుంతలం సినిమాకి సంబంధించి కాస్టింగ్ సెలక్షన్స్ కూడా జరుగుతున్నాయట. అయితే గుణ శేఖర్ ఈ శాకుంతలం సినిమాని ప్రకటించినప్పటి ఉంచి హీరోయిన్ విషయంలో పలు రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. శాకుంతలంగా అనుష్క శెట్టి.. పూజా హెగ్డే నటించబోతుందన్న ప్రచారం జరిగింది. కాని గుణ శేఖర్ సమంత ని ప్రకటించి షాకిచ్చారు. ఆ తర్వాత సమంత కి జంటగా నటించే దుష్యంతుడు ఈ హీరోనే అన్న ప్రచారం మొదలైంది.

Shakunthalam: శాకుంతలం టీం తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఏముంది ..?

 

Advertisement

shakuntalam team is warned by requesting

అంతేకాదు ఈ సినిమా బడ్జెట్ గురించి కూడా రక రకాల వార్తలు వస్తున్నాయి. ఇక శాకుంతలం సినిమాలో పలు పాత్రలకి సంబంధించిన నటుల పేరు కూడా ప్రస్తావిస్తూ వార్తలు రాసేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాకుంతలం టీం రిక్వెస్ట్ చేస్తూ మేము అధికారకంగా ప్రకటించే వరకు ఏ విషయానికి సంబంధించిన న్యూస్ స్ప్రెడ్ చేయకండి అంటూ సోషల్ మీడియా వేధికగా తెలిపారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు శాకుంతలం టీం. ఈ పోస్టర్ లో చాలా క్లియర్ గా టీం చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పారు. మరి గాసిప్ రాయుళ్ళు వింటారా..లేక పెడచెవిన పెట్టి మళ్ళీ వార్తలు సృష్టిస్తారా చూడాలి.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి