Samantha : సమంత అనారోగ్యం కారణంతో గత కొన్నాళ్లుగా సినిమాల షూటింగ్ లతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పూర్తిగా బెడ్ కే పరిమితమైన సమంత ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. వచ్చే నెల నుండి షూటింగ్ లకు హాజరు కాబోతున్నట్లుగా ఆమె నటిస్తున్న చిత్ర యూనిట్ సభ్యులకు సమాచారం అందించిందట. ఇదే సమయంలో సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధం కాబోతుంది. వచ్చే నెల 17వ తారీఖున విడుదల కాబోతున్న శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం సమంత కాస్త ఎక్కువగానే కష్టపడబోతున్నట్లుగా తెలుస్తోంది.
నార్త్ తో పాటు సౌత్ లోని అన్ని రాష్ట్రాల్లో కూడా సమంతతో ప్రచారం చేయించేందుకు గాను గుణశేఖర్ టీం వర్క్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా సమంత అనారోగ్య సమస్యను జనాల ముందుకు తీసుకు రావడం ద్వారా సినిమాకు ఎక్కువగా ప్రమోషన్ చేయాలని వారు భావిస్తున్నారట. ట్రైలర్ రిలీజ్ సమయంలో సమంత కన్నీళ్లు పెట్టుకోవడంతో అనూహ్యంగా పబ్లిసిటీ దక్కింది. భారీ ఎత్తున పబ్లిసిటీ రావాలి అంటే ఒకటి రెండు సార్లు అయినా సమంత కన్నీళ్లు పెట్టుకోవాలంటూ శాకుంతలం చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమంత పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటే కచ్చితంగా ఆమె అనారోగ్య సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది,
అప్పుడు ఆమె కన్నీళ్లు పెట్టుకునే విజువల్స్ మీడియాకు చిక్కుతాయి. దాంతో శాకుంతలం సినిమా ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత అంటూ పదే పదే స్క్రోలింగ్ వస్తుంది. అలా శాకుంతలం సినిమాకు మంచి పబ్లిసిటీ లభించినట్లు అవుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుణశేఖర్ టీం మెంబెర్స్ మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. సమంత తమ సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఒప్పుకున్నారు, అంతే తప్ప ఆమెను ఎమోషనల్ గా వాడుకోవాల్సిన అవసరం శాకుంతలం టీం కి లేదని, కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.