Home » Entertainment » Shannu Fires On Siri In Bigg Boss 5 Telugu 12th Week
Entertainment

Bigg Boss 5 Telugu : నన్ను చెడగొట్టకు!.. షన్నుకి సరి వార్నింగ్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: November 25, 2021 9:43 am
Advertisement

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్నులు ఎప్పటికీ అర్థం కాదు. అప్పుడే బాగుంటారు. అప్పుడే గొడవ పడుతుంటారు. ఇక సిరి షన్నులు నిన్నటి ఎపిసోడ్‌లోనూ గొడవలు పడ్డారు. బిగ్ బాస్ ఇంటికి షన్ను చివరి కెప్టెన్‌గా నిలిచాడు. అయితే సిరి, కాజల్ గుస గుసలు పెడుతుంటారు. గట్టిగా మాట్లాడాలని ఆ ఇద్దరికి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు.. నాకు ఎఫెక్ట్ అవుతుంది. నీ ఫ్రెండ్‌కే ఎఫెక్ట్ అవుతుంది గుర్తు పెట్టుకో అని సిరికి షన్ను గట్టిగా చెబుతాడు.

Advertisement

అలా చెప్పిన కాసేపటికే మళ్లీ సిరి మైక్ సరిగ్గా ధరించకపోవడంతో బిగ్ బాస్ ఆదేశిస్తాడు. సరిగ్గా ధరించు అని బిగ్ బాస్ వాయిస్ రావడంతో షన్నుకి కోపం పెరుగుతుంది. దీంతో సిరి క్షమించమని అడుగుతుంది. కోపం తగ్గించేందుకు సిరినే గుంజిళ్లు తీస్తుంది. అయినా కూడా కోపంగానే చూస్తుంటాడు. అలా ఈ ఇద్దరికి మళ్లీ గొడవ జరిగింది. దీని వల్లే జరిగిందా? లేక మరే కారణమో తెలీదు కానీ ఇద్దరి మధ్య మాటలు మళ్లీ చెలరేగాయి.

Shannu Fires On Siri In Bigg Boss 5 Telugu 12th Week

Advertisement

Bigg Boss 5 Telugu : సిరి మొహం మీదే చెప్పిన షన్ను

నువ్ నాకు అవసరం లేదు. నువ్ లేకుండా నేను బాగానే ఆడుతున్నాను.. నువ్ నన్ను చెడగొట్టకు అని సిరికి షన్ను మొహం మీదే చెబుతాడు. ఈ మాటలతో హర్ట్ అయిన సిరి బాత్రూం ఏరియాలోకి వెళ్లి బాధపడుతుంది. మళ్లీ వెంటనే షన్ను వచ్చి సారీ చెబుతాడు. అలా ఈ ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు అవుతుంటాయి.. ఎందుకు అలా ప్రవర్తిస్తారు అనే విషయాలు అంతుపట్టడం లేదు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి