Shivaji : బయటికి రాగానే పల్లవి ప్రశాంత్ ని కలిసిన శివాజీ .. ఆ ముగ్గురికి స్ట్రాంగ్ వార్నింగ్..!
Shivaji : బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన అతడికి 14 రోజులు రిమాండ్ విధించి చంచల్ గూడా జైలుకు తరలించారు. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లో వఅడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించి టైటిల్ విన్నర్ గా నిలిచాడు అయితే బిగ్బాస్ ఫైనల్స్ అనంతరం జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర పల్లవి ప్రశాంత్ అభిమానులకు రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవల్లో పలువురు కంటెస్టెంట్ల కార్ల అద్దాలు ధ్వంసం చేయడమే కాకుండా రోడ్డుపైకి వచ్చి ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేశారు. అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ బెయిల్ మీద బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ కు సపోర్టుగా నిలిచిన శివాజీ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అందులో పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నారు.
ఇక శివాజీ మాట్లాడుతూ .. పల్లవి ప్రశాంత్ జైల్లో ఉంటే శివాజీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని అంటున్నారు. చూసుకోవడానికి లాయర్లు ఉన్నారు. పల్లవి ప్రశాంత్ ఫ్యామిలీతో టచ్ లోనే ఉన్నాను. చట్టాన్ని ఎప్పుడు గౌరవిస్తాను. అందుకే కోర్టు దగ్గరికి వెళ్లలేదు అని అన్నారు. ఇక ప్రశాంత్ నా బిడ్డ. చాలా మంచివాడు. ఇక ఈ వయసులో కొన్ని చిన్న చిన్న తప్పులు దొర్లడం మామూలే. బయట నుంచి వచ్చాక అంత మంది అభిమానులను చూశాక ప్రశాంత్ కొంచెం అత్యుత్సాహం ఫీలయ్యి ర్యాలీలో పాల్గొన్నారు. అంతే తప్ప అతడు చెడ్డవాడు కాదు అని శివాజీ అన్నారు. తాను బిగ్ బాస్ హౌస్ లో నాలుగు నెలలు ఉండి ప్రశాంత్ ను దగ్గరగా చూశానని తెలిపారు. గెలిచానని ఆనందం ఒక్కోసారి మనిషిని డామినేట్ చేస్తుందని, అలాంటి పరిస్థితుల్లో ప్రశాంత్ ఎగ్జైట్ అయి ర్యాలీలో పాల్గొన్నారు. బయట జరిగిన గొడవ గురించి కానీ తాను స్టూడియో నుండి బయటకు రావడానికి ముందే కొంతమంది కంటెస్టెంట్ల కార్ల అద్దాలు పగలగొట్టిన విషయం పల్లవి ప్రశాంత్ కు తెలియదని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాను చేసిన తప్పును త్వరలోనే సరిదిద్దుకుంటాడు. ప్రశాంత్ లో ఒక తెలియని హీరో ఉన్నాడు. అది బయటికి రావాలని నా కోరిక. మనం ఎవరు తీసుకురావడానికి చట్టం బయటికి తీసుకొస్తుంది. న్యాయ ప్రకారం చట్టం తీసుకొస్తుంది ప్రశాంత్ కి న్యాయం జరిగింది. కాబట్టే బయటికి వచ్చాడు. ప్రశాంత్ ఒక బాధితుడు. నిందితుడు కాదు. అది అభిమానుల వలన జరిగింది తప్ప అతడు చేయలేదు అని అన్నారు. ఇక అమర్ దీప్ 100% చెడ్డవాడేం కాదు. మంచివాడే కానీ కొన్నిసార్లు తొందర పడుతుంటాడు. అంతే తప్ప అతడు చెడ్డవాడు కాదు. ఇక పల్లవి ప్రశాంత్ జైలు నుంచి రాగానే శివాజీని కలిసినట్లుగా ఉన్నారు. ఈ క్రమంలోనే లైవ్ వీడియోలో శివాజీ పల్లవి ప్రశాంత్ ను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.