Bigg Boss Telugu 7 : నావల్ల కాదు బిగ్ బాస్.. నన్ను పంపించేయండి.. ఇక్కడ ఉండలేకపోతున్నా.. బిగ్ బాస్ కాళ్లు పట్టుకొని ఏడ్చిన శివాజీ

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకూ ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే 50 రోజులకు దగ్గరికి వచ్చింది. ఇంకో 50 రోజులు అయితే బిగ్ బాస్ సీజన్ కూడా పూర్తవుతుంది. ఇప్పటి వరకు హౌస్ లో కొంచెం బెటర్ గా ఉన్న వాళ్లు, ప్రేక్షకుల మనసు గెలుచుకున్న వాళ్లు అంటే వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 లో ఎవరు ఉంటారు అంటే టక్కున వచ్చే సమాధానం శివాజీ. ఆయనే ప్రస్తుతం టాప్ లో ఉన్నారు. ఆయన చేయికి దెబ్బ తాకినా, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నా శివాజీ మాత్రం మొండిగా బిగ్ బాస్ హౌస్ లో పోరాడుతున్నారు. కానీ.. తాజాగా బిగ్ బాస్ తదుపరి కెప్టెన్ కోసం జరిగే టాస్క్ లో అమర్ దీప్.. శివాజీ కెప్టెన్ కు అనర్హుడు అని ఓటు వేస్తాడు. ఆయన బ్యాడ్జిని నీళ్లలో ముంచేస్తాడు. దీంతో శివాజీకి కోపం వస్తుంది. అసలు నేను ఎందుకు అనర్హుడినో ఒక్క రీజన్ చెప్పు అని అడుగుతాడు బిగ్ బాస్. దీంతో కష్టపడి ఆడా కదా అన్నా.. ఒక్క చాన్స్ ఉంటది అని అంటాడు అమర్ దీప్.

దీంతో నేను కష్టపడలేదా.. నేను ఒక వేస్ట్ క్యాండిడేట్ లా కనిపిస్తున్నానా? అది ఫెయిర్ గేమ్ కాదు. ఇక్కడ తప్పు ఒప్పు.. మంచి చెడు ఏం లేదు. అన్న ఆడాడు.. ఆడించాడు కాబట్టి ఇక్కడ అన్న కంటే ఎక్కువ కష్టపడ్డవాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే శివాజీ అన్నకు వేస్తున్నాను అని అమర్ క్లారిటీగా చెప్పడంతో శివాజీకి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే వెక్కి వెక్కి ఏడుస్తాడు. దీంతో బిగ్ బాస్ వెంటనే కన్ఫెషన్ రూమ్ కు శివాజీని పిలుస్తాడు. శివాజీ చెప్పండి మీ బాధ ఏంటి అని బిగ్ బాస్ అడుగుతాడు. దీంతో బాగా ఇబ్బంది పడుతున్నా బిగ్ బాస్. బాగా చేయి నొస్తుంది. లాగుతోంది అని చెబుతాడు శివాజీ. ఎవరూ లేకపోతే నేను ఏడుస్తున్నా. ఎవరన్నా ఉంటే నవ్వుతూ లోపల ఏడుస్తున్నా అని చెబుతాడు శివాజీ. అందరి ముందు ఏడవలేకపోతున్నాను. చాలా బరువుగా ఉంది అని వెక్కి వెక్కి ఏడుస్తాడు శివాజీ.

shivaji shares his pain with bigg boss

Bigg Boss Telugu 7 : శివాజీని ఇంటి నుంచి పంపించేస్తారా?

నువ్వు ఆడటం లేదు అంటూ నన్ను కెప్టెన్ కి డిజర్వ్ కాదు అని చెప్పారు బిగ్ బాస్. అది ఇంకా బాదేసింది. ఆడలేదు అని ఇన్ డైరెక్ట్ గా అనేసరికి చాలా బాదేసింది బిగ్ బాస్ అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన శివాజీని చూసి బిగ్ బాస్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఆ ప్రోమో చూసి బిగ్ బాస్ అభిమానులు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. పాపం.. శివాజీకి ఈ వయసులో ఎందుకు ఇంత కష్టం అని బిగ్ బాస్ అభిమానులు ఏడ్చేస్తున్నారు. అయితే.. శివాజీకి చేయి నొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. నడుము నొప్పి కూడా శివాజీని వేధిస్తోంది. దీంతో శివాజీని ఇంటి నుంచి మధ్యలోనే పంపించేందుకు బిగ్ బాస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక రెండు మూడు వారాలు ఇంట్లో రెస్ట్ తీసుకున్న తర్వాత ఒకవేళ శివాజీ ఆరోగ్యం కుదుటపడితే శివాజీని తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Recent Posts

Fish Venkat : ఫిష్ వెంక‌ట్‌కి ఇలాంటి ప‌రిస్థితి రావ‌డానికి కార‌ణం అదేనా?

Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…

23 minutes ago

Ys Jagan : బాబు అడ్డాపై జగన్ ఫోకస్..!

Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…

1 hour ago

Former MLCs : ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీ ల బాధలు అన్నీఇన్నీ కావు..!

Former MLCs  : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…

2 hours ago

Allu Ajun : అల్లు అర్జున్‌తో ప్ర‌శాంత్ నీల్ రావ‌ణం.. దిల్ రాజు గ‌ట్టిగానే ప్లాన్ చేశాడుగా..!

Allu Ajun  : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…

3 hours ago

Chandrababu : జగన్ లా హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేయను : సీఎం చంద్రబాబు

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు…

4 hours ago

Green Chicken Curry : రొటీన్ చికెన్ కర్రీ తిని బోర్ కొట్టిందా… అయితే, ఈ గ్రీన్ చికెన్ కర్రీని ఇలా ట్రై చేయండి, అదిరిపోయే టేస్ట్…?

Green Chicken Curry : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కొత్త వంటకాన్ని ట్రై చేసి చూడాలి అనుకుంటారు.…

5 hours ago

Hari Hara Veera Mallu Movie Trailer : అద్దిరిపోయిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ట్రైల‌ర్.. పూన‌కాలు తెప్పిస్తుందిగా..!

Hari Hara Veera Mallu Movie Trailer  : తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా వెలుగొందుతున్న పవర్‌స్టార్ పవన్…

6 hours ago

Ram Charan Fans : రామ్ చ‌ర‌ణ్ చేసిన త‌ప్పేంటి.. మెగా ఫ్యాన్స్ ప్ర‌శ్న‌ల‌కి శిరీష్ స‌మాధానం చెబుతారా?

Ram Charan Fans  : 'ఆర్‌.ఆర్‌.ఆర్' సినిమా తరువాత, పలు నిర్మాతలు రామ్ చ‌ర‌ణ్‌తో సినిమాలు చేయాలని ఆస‌క్తి చూపినా,…

6 hours ago