Home » Entertainment » Shrihan Comes Bigg Boss 6 Telugu Ott
Entertainment

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ 5లో సిరి సంద‌డి చేస్తే ఓటీటీలో ఆమె ప్రియుడు రాబోతున్నాడ‌ట‌..!

Authored By
Sam C
The Telugu News | Updated on: January 6, 2022 8:54 pm
Advertisement

Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ప‌సందైన వినోదం పంచుతుంది. వంద రోజుల‌కి పైగా ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ సంద‌డి చేస్తుంది. తెలుగులో ఇటీవ‌ల సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం పూర్తి కాగా, త్వ‌ర‌లో సీజ‌న్ 6తో పాటు బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కానుంది. ఓటీటీకి నాగార్జున హోస్ట్‌గా ఉంటార‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా, ఇందులో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్‌కి సంబంధించి అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Advertisement

తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 5 కంటెస్టెంట్ సిరి ప్రియుడు శ్రీహాన్‌ని ఓటీటీలోకి తీసుకురావాల‌ని నిర్వాహ‌కులు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. రీసెంట్‌గా శ్రీహాన్.. స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవుతున్న స్టార్ మ్యూజిక్ ప్రోమోలో సందడి చేశాడు . అతనితో పాటు మరికొంతమంది యూట్యూబ్ స్టార్లు ఈ ఎపిసోడ్‌లో కనిపించడంతో వీళ్లలో మెహబూబ్ మినహా.. మిగిలిన వాళ్లకి బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్‌కి బెర్త్ కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది.

shrihan comes Bigg Boss 6 Telugu ott

Advertisement

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ ఓటీటీతో అదృష్టం ప‌రీక్షించుకోనున్నాడా..!

ఇదిలా ఉంటే శ్రీహాన్ తన ఇన్‏స్టా ఖాతా నుంచి సిరి ఫోటోస్.. డెలిట్ చేసేశాడని టాక్. కేవలం ఇద్దరూ కలిసి నటించిన వెబ్ సిరీస్‏లకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే ఉన్నాయి. దీంతో శ్రీహాన్, సిరి మధ్య బ్రేకప్ జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్ర‌మంలో శ్రీహాన్.. సిరిపై కోపంతోనే బిగ్ బాస్ ఓటీటీలోకి అడుగుపెట్ట‌బోతున్నాడ‌ని టాక్ న‌డుస్తుంది. ఈ షో ద్వారా మ‌రింత క్రేజ్ తెచ్చుకోవాల‌ని ఆయ‌న భావిస్తున్నాడ‌ట‌.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి