శృతి హాసన్ దాదాపు మూడేళ్ళ తర్వాత టాలీవుడ్ లో దర్శనమిచ్చింది. మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మీద ముందు నుంచి సంగతి తెల్సిందే. రవితేజ – గోపీచంద్ మలినేని – శృతి హాసన్ చాలా నమ్మకంగా ఉన్నారు. వాళ్ళ నమ్మకం వమ్ము కాలేదు. క్రాక్ సినిమా భారీ కమర్షియల్ హిట్ అన్న టాక్ తెచ్చుకొని సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇంకా సంక్రాంతి పండుగ రానేలేదు. బరిలో దిగాల్సిన సినిమాలు కూడా ఇంకా రిలీజ్ కాలేదు. కాని క్రాక్ సినిమానే సంక్రాంతి విన్నర్ అని బ్లైండ్ గా డిసైడవుతున్నారు.
కాగా మూడేళ్ళ తర్వాత వచ్చిన క్రాక్ సినిమా సక్సస్ తో శృతి హాసన్ ఉబ్బి తబ్బిబ్బవుతోంది. తాజాగా తన ఆనందాన్ని పంచుకుంది శృతి హాసన్. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది. శృతి హాసన్ ఈ సినిమాలో తల్లి పాత్రలో నటించింది. వాస్తవంగా అయితే శృతి హాసన్ ఇప్పుడే ఇలాంటి పాత్రలు చేయాల్సిన అవసరం లేదు. కాని కథ.. అందులో పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి సంతోషంగా నటించింది. అంతేకాదు క్రాక్ సినిమాలో పోషించిన పాత్రకి గాను ప్రశంసలు అందుకుంటోంది.
ఇకపై కూడా శృతి హాసన్ హాసన్ తల్లి పాత్రలు వస్తే నటిస్తానని చెప్పుకొచ్చింది. అయితే శృతి హాసన్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ మాట డైజెస్ట్ కావడం లేదట. కాగా శృతి హాసన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా కూడా చేసింది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలని జరుపుకుంటుండగా ఏప్రిల్ 9 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బలుపు, డాన్ శీను తర్వాత రవితేజ – గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ సాధించారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.