Home » Entertainment » Shruti Haasan Leaves Santanu Hazarika And Went To Italy For Shoot
Entertainment

Shruti Haasan : ప్రియుడ్ని వదిలి వెళ్లకతప్పడం లేదట.. తెగ బాధపడుతోన్న శ్రుతి హాసన్.. భలే హత్తుకున్నారే

Authored By
aruna
The Telugu News | Published on: August 25, 2022, 10:20 pm
Advertisement

Shruti Haasan : సౌత్ అయినా నార్త్ అయినా.. సెలెబ్రిటీల ఎఫైర్లు, లవ్ స్టోరీలు, బ్రేకప్ కథలు, డేటింగ్ రూమర్లు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అందరూ కూడా వాటి మీద దృష్టి పెడుతుంటారు. అలా శ్రుతి హాసన్ లవ్ స్టోరీలు ఎప్పుడూ వైరల్ అవుతుంటతాయి. సిద్దార్త్‌తో ప్రేమ వ్యవహారం మధ్యలోనే బెడిసి కొట్టేసింది. ఇక ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్‌తో కొన్ని రోజులు డేటింగ్ చేసింది. ఇక ఇప్పుడు శంతను హజారికా అనే పెయింటర్ ఆర్టిస్ట్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది.ఈ ఇద్దరూ కలిసి ముంబైలో మకాం పెట్టేసిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ కలిసే ఉంటున్నారు. లివింగ్ రిలేషన్ షిప్‌ను ఈ ఇద్దరూ ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు అయితే పెళ్లి ప్రస్థావన తీసుకురాలేదు.

Advertisement

కరోనా సమయంలోనూ ఈ ఇద్దరూ కలిసే ఉన్నారు. ఈ ఇద్దరూ కూడా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. మొత్తానికి ముంబై వీధుల్లో ఈ ఇద్దరూ చేసే హంగామాకు అంతా ఫిదా అవుతుంటారు. ఎయిర్ పోర్టు, పబ్లిక్ మాల్స్ ఇలా అన్ని చోట్లా ఈ ఇద్దరూ రచ్చ చేస్తుంటారు. ఓ సారి సూపర్ మార్కెట్‌లో చేసిన రొమాన్స్ నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరితో పాటు అప్పుడప్పుడు అక్షర హాసన్ కూడా కనిపిస్తుంటుంది. ఈ ముగ్గురూ కలిసి చేసే సందడి వేరే లెవెల్లో ఉంటుంది. శ్రుతి హాసన్ ఈ మధ్య బాక్సింగ్ వంటిది కూడా నేర్చుకుంటోంది. వర్కవుట్లతో ఫుల్ బిజీగా ఉంటోంది.

Shruti Haasan Leaves Santanu Hazarika and went to italy for shoot

Advertisement

సినిమా కోసం ఇదంతా చేస్తుందా? లేదా తన ఫిట్ నెస్ కోసం చేస్తుందా? అన్నది తెలియడం లేదు. కానీ శ్రుతి హాసన్ మాత్రం తన యోగ, జిమ్‌లతో ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా శ్రుతి హాసన్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. నిన్ను వదిలి వెళ్లాలని లేదు కానీ.. పని పిలుస్తోంది.. రమ్మంటోంది.. వెళ్లక తప్పడం లేదు అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో శంతను ఎంచక్కా శృతి హాసన్‌ను హత్తుకున్నాడు. ఇక నీరజ కోనతో కలిసి శ్రుతి హాసన్ ఇటలీకి వెళ్లినట్టు కనిపిస్తోంది. మరి ఏ సినిమా షూటింగ్ కోసమన్నది శ్రుతి హాసన్ క్లారిటీ ఇవ్వలేదు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి