Shruti Haasan : సమంతని ఫాలో అయిన శృతి హాసన్.. కొత్త బాయ్ ఫ్రెండ్‌తో కూడా దోస్తీ కట్..!
Shruti Haasan : ఇటీవల ప్రేమలు, బ్రేకప్‌లు సహజంగా మారాయి. ఇంతకు ముందు బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన బ్రేకప్ కహానీలు గమనిస్తే… లవ్ చేసుకునేటప్పుడు ఒకరినొకరు ఫాలో అవ్వడంతో పాటు విపరీతంగా పోస్టులు చేసుకునే వారు. అయితే బ్రేకప్ అయ్యాక అన్ ఫాలో అవ్వడం కామన్ థింగ్ గా మారింది. విడాకుల విషయం అనౌన్స్ చెయ్యడానికి ముందు నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ సైతం ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. ఇక నాగ చైతన్యను సమంత అన్ ఫాలో అయ్యింది. అదే విధంగా ఇప్పుడు శృతి, శాంతను అన్ ఫాలో అయ్యారని ముంబై ఇండస్ట్రీ జనాలు భావిస్తున్నారు. వారిద్దరి రిలేషన్ బ్రేక్ అయిందని చెప్పుకొస్తున్నారు.
ఒకప్పుడు లండన్‌కి చెందిన వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో ఉన్న శృతి హాసన్ కొన్నాళ్లకి అతని నుండి విడిపోయి డూడుల్ ఆర్టిస్ట్ శాంతనుతో ప్రేమాయణం సాగించింది. ఇద్దరు కలిసి తిరగడం, చెట్టా పట్టాలు వేసుకోవడం, సోషల్ మీడియాలో రచ్చ చేయడం మనం చూశాం.కానీ గత కొన్ని రోజుల నుంచి వీళ్ళిద్దరూ కలిసి సోషల్ మీడియాలో సందడి చేయడం మానేశారు. దీంతో అసలు మేటర్ ఏంటా అని ఆరా తీస్తే.. శాంతను, శృతి హాసన్ మధ్య బ్రేకప్ జరిగిందని తెలుస్తోంది. నిన్న మొన్నటిదాకా ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో హల్చల్ చేయగా, తాజాగా చూస్తే శృతి హాసన్ శాంతను హాజరికను ఫాలో అవ్వడం లేదు. అతను కూడా శృతిని ఇన్స్టాలో అన్ ఫాలో చేయడం విశేషం. ఇలా ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని అంటున్నారు.
Shruti Haasan : సమంతని ఫాలో అయిన శృతి హాసన్.. కొత్త బాయ్ ఫ్రెండ్‌తో కూడా దోస్తీ కట్..!
మరోవైపు శృతి హాసన్ ఏకంగా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి శాంతనుతో దిగిన ఫోటోలను డిలీట్ చేసి పారేసింది.ఈ పరిణామాలు చూస్తుంటే వారిద్దరు విడిపోయారని,దీనిపై ఏదైన అఫీషియల్ ప్రకటన చేస్తారా అని ముచ్చటించుకుంటున్నరు. శృతి హాసన్ కు ఇది సెకండ్ బ్రేకప్. ఇంతకు ముందు ఇటాలియన్ యాక్టర్ మైఖేల్ కోర్స్ లేతో కొన్ని నెలలు డేటింగ్ చేశాక అతడితో విడిపోయింది. ఇక కెరీర్ విషయానికి వస్తే ‘సలార్ 1’తో గత ఏడాది భారీ బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న శృతి హాసన్ ఇప్పుడు ‘సలార్ 2’ షూటింగ్ చెయ్యడానికి రెడీ అవుతోంది. ఇది కాకుండా అడివి శేష్ జంటగా ‘డెకాయిట్’ సినిమా చేస్తోంది. కన్నడ స్టార్ యశ్ ‘టాక్సిక్’, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘కూలి’ సినిమాల్లోనూ శృతి కథానాయికగా ఎంపికైందని టాక్.
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
This website uses cookies.