Home » Entertainment » Singer Chinmai Comments On Nayanthara Surrogacy
Entertainment

Chinmayi : నయనతార సరోగసిపై సింగర్ చిన్మయి కామెంట్స్.. చెప్పుతో కొట్టినట్టు కౌంటర్ ఇచ్చిందిగా..!

Authored By
mallesh
The Telugu News | Updated on: October 19, 2022 1:49 pm
Advertisement

Chinmayi : లేడి సూపర్ స్టార్ నయనతార పుణ్యమా అని ప్రస్తుతం నెటిజన్లకు కొత్త టాపిక్ దొరికింది.ఇంకేముంది ముందు నయన్‌ను ట్రోల్ చేసిన జనాలు.. ప్రస్తుతం టార్గెట్‌ను సింగర్ చిన్మయి వైపునకు మళ్లించారు. నయన్ చేసిన పనికి ఓ వైపు ఆమెను ట్రోల్స్ చేస్తూనే మరోవైపు చిన్మయిని తగులుకున్నారు ట్రోలర్స్. చిన్మయికి కూడా రీసెంట్‌గా కవల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే. ఆమెది కూడా సరోగసి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సరోగసి విషయంలో తనను లాగడంపై సింగర్ చిన్మయి గట్టిగానే స్పందించింది.

Advertisement

తనకు కవలు పిల్లలు జన్మించారనే విషయాన్ని మాత్రమే సింగర్ చిన్మయి తన అభిమానులతో పంచుకుంది. కానీ తను గర్భవతిగా ఉన్నప్పుడు దిగిన ఫోటోలు కానీ, పిల్లలు పుట్టాక వారికి సంబంధించిన పిక్స్ కానీ సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. దీనివల్లే సింగర్ చిన్మయిని నెటిజన్లు ట్రోల్ చేసినట్టు టాక్. ఈ క్రమంలోనే తనపై వస్తున్న రూమర్లకు సింగర్ చిన్మయి నెటిజన్లకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చింది. తను బేబీ బంప్‌తో దిగిన సెల్ఫీ పిక్‌ను నెట్టింట షేర్ చేసింది. తాను సరోగసి ప్రక్రియ ద్వారా పిల్లలను కనలేదని స్ఫష్టం చేసింది.

Singer Chinmai comments on Nayanthara surrogacy

Advertisement

Chinmayi : చిన్మయి కౌంటర్ లేడి సూపర్ స్టార్ కోసమేనా..

అంతేకాకుండా నేను గర్భవతిగా ఉన్నప్పుడు దిగిన పిక్స్, నా పిల్లలకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడదలచుకోలేదు. నాకు నా కుటుంబం, నా స్నేహితుల ప్రైవసీ ఇంపార్టెంట్. మా పిల్లల ఫోటోలు ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించవు అంటూ పోస్టు పెట్టింది. చిన్మయి పెట్టిన పోస్టును ప్రస్తుతం నెటిజన్లు లేడి సూపర్ స్టార్ నయనతారకు అప్లై చేస్తున్నారు. నయనతార దంపతులు కూడా పిల్లలు పుట్టాక ఫోటోలు నెట్టింట షేర్ చేయకపోతే ఇంత పెద్ద చర్చ జరిగేది కాదు కదా.. నయన్‌కు కవల పిల్లలు కలుగడానికి సాయం చేసిన తన స్నేహితురాలు.. డాక్టర్ ఇప్పుడు ఇబ్బందులు పడేవారు కాదని పరోక్షంగా చిన్మయి కౌంటర్ ఇచ్చిందని కొందరు హైలెట్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి