Home » Entertainment » Siri And Priyanak Singh Discussing About Manas In Bigg Boss 5 Telugu
Entertainment

Bigg Boss 5 Telugu : బాబోయ్.. వీళ్లు మానస్ ను కొరుక్కుతినేలా ఉన్నారు.. మానస్ పై సిరి కన్నేస్తే పింకీ ఏం చేసిందంటే?

Authored By
Varun G
The Telugu News | Updated on: October 14, 2021 9:23 pm
Advertisement

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 తెలుగు ప్రస్తుతం మంచి టాక్ తెచ్చుకుంటోంది. బిగ్ బాస్ స్టార్ట్ అయి నెల రోజులు దాటింది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఉన్న కంటెస్టెంట్లలోనూ అందరి మధ్య మంచి బాండ్ ఏర్పడింది. కొన్ని గ్రూపులు, కొన్ని జంటలు.. ఇలా బిగ్ బాస్ హౌస్ లో ట్రాకులు మాత్రం బాగానే నడుస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన లవ్ ట్రాక్ అంటే శ్రీరామ్, హమీద. కానీ.. హమీద గతవారమే ఎలిమినేట్ అయిపోవడంతో శ్రీరామ్ ఒంటరివాడు అయిపోయాడు.

Advertisement

siri and priyanak singh discussing about manas in bigg boss telugu 5

ఇప్పటికే ప్రియాంక(పింకీ).. మానస్ మీద మనసు పారేసుకున్న విషయం తెలిసిందే. ప్రియాంక.. అందరినీ అన్నయ్య అని పిలిచినా.. మానస్ ను మాత్రం అన్నయ్య అని ఇప్పటి వరకు పిలవలేదు. తనంటే ముందు నుంచి ఇష్టం. చాలాసార్లు మానస్ మీద తనకు ఉన్న ఇష్టాన్ని చాలాసార్లు చూపించే ప్రయత్నం చేసింది ప్రియాంక. ఇదివరకు ఓసారి మానస్ ను కూడా తన రిలేషన్ షిప్ గురించి అడిగినట్టు గుర్తు.

Advertisement

Bigg Boss 5 Telugu : తాజాగా ప్రోమోలో ముచ్చట్లు పెట్టుకున్న లేడీస్

siri and priyanak singh discussing about manas in bigg boss 5 telugu

తాజాగా.. బిగ్ బాస్ 5 లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో హౌస్ లోని లేడీస్ అంతా అర్ధరాత్రి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. ప్రియాంకను కావాలని ఏడిపించాలని ప్లాన్ చేసిన సిరి.. మానస్ ఎంత బాగున్నాడో.. ఎంత క్యూట్ గా ఉన్నాడో.. అంటూ ప్రియాంక ముందే సిరి కామెంట్ చేయడంతో ప్రియాంక షాక్ అవుతుంది. అయ్యో.. నీ దిష్టే తగిలేట్టు ఉందే.. అంటూ ప్రియాంక సిరిని అటు సైడ్ నెట్టేస్తుంది. వామ్మో.. తను కన్నేసినవాడిపై వేరేవాళ్లు కన్నేస్తే.. పింకీ అస్సలు ఊరుకోదు కావచ్చు. రచ్చ రచ్చ చేసేసింది. దీనికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి