
sitara friend samantha do you know
Sitara : మహేష్ గారాల పట్టి సితార ఇటీవలి కాలంలో తెగ సందడి చేస్తుంది. ఒక వైపు సోషల్ మీడియా మరో వైపు స్పెషల్ సాంగ్స్‌లో దర్శనమిస్తూ రచ్చ చేస్తుంది. ఘట్టమనేని నటవారసురాలిగా, మహేష్ బాబు గారాల పట్టీ గా ఇప్పటికే సోషల్ మీడియా లో సితార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సితార ను హీరోయిన్ గా తీసుకొస్తారా..?లేక వేరే రంగంలో తీసుకెళ్తారా..? అనేది మహేష్ అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. సర్కారు వారి పాట ఈ సినిమాలోని పెన్నీ సాంగ్ లో సితార డాన్స్ స్టెప్పులతో అదరగొట్టేసింది. పెన్నీ సాంగ్‌లో కూతురు సితార పర్‌ఫార్మెన్స్ గురించి అడగగా “అది థమన్ ఆలోచన. నాకు కూడా తెలియదు.
ఇంటికి వెళ్లి నమ్రత కు చెప్పేలోపు అతనే నమ్రతను అడిగేశాడు. ఇక సాంగ్ లో సితార డాన్స్ చాలా బాగా చేసింది” అని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు.సితార కూడా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంది. ఈ క్రమంలో సితారకు మహేష్ బాబుతో పని చేసిన హీరోయిన్లకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. సమంత, రష్మిక మందనల గురించి చెప్పమని సితారను అడిగితే.. క్యూట్‌గా సమాధానం చెప్పేసింది.సమంత అని సంబోధిస్తూనే.. సామ్ ఆంటీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసింది సితార. నాతో ఎక్కువగా ఆడుకుంటుంది.. సెట్‌లోకి వచ్చినప్పుడు నాతోనే ఉంటుంది.. ఆడుతూ ఉంటుంది.. ప్లే ఫుల్ అని సమంత గురించి సితార చెప్పేసింది.
sitara friend samantha do you know
ఇక రష్మిక విషయం గురించి చెబుతూ.. ఆమె ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.. ఎనర్జీగా ఉంటుంది.. క్యూట్‌గా ఉంటుందని సితార తెలిపింది.ఇన్ స్టాగ్రాంలో ఆస్క్ ఎనీథింగ్ అని పెట్టగా అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. వాటిలోంచి కొన్నింటికి మహేష్ బాబు సమాధానం ఇచ్చారు. ఇంట్లో ఎవరు స్మార్ట్ అని అడిగితే.. సితార అని సమాధానం ఇచ్చారు. పెన్నీ సాంగ్‌లో సితార నటించింది కదా? అంటే త్వరలోనేనటిగా కూడా ఎంట్రీ ఇస్తుందా? అని అడిగితే.. ఆల్రెడీ తను నటిగా నిరూపించుకుందని అనుకుంటున్నాను అని మహేష్ బాబు సమాధానం ఇచ్చారు. సర్కారు వారి పాట నుంచి ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ తనకు ఇష్టమని మహేష్ బాబు తెలిపారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.