Home » Entertainment » Sitara Kuchipudi Dance For First Time In Video
Entertainment

Sitara : తొలిసారి కూచిపూడి డ్యాన్స్ చేసిన సితార‌.. హ్యాపీగా ఫీలైన మ‌హేష్‌ బాబు

Authored By
Sam C
The Telugu News | Published on: April 10, 2022, 1:30 pm
Advertisement

Sitara: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవ‌లి కాలంలో సితార ప్రేక్ష‌కుల‌ని తెగ అలరిస్తుంది. ఇటీవ‌ల స‌ర్కారు వారి పాట సినిమా కోసం పెన్నీ సాంగ్‌తో అల‌రించిన సితార తాజాగా కూచిపూడి డ్యాన్స్ చేసింది. కూచిపూడి డ్యాన్స్ చేసి త‌న తండ్రి , టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుని ఫిదా చేసింది సితార‌. ఇందుకు సంబంధించిన వీడియోను మ‌హేశ్ బాబు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.”సితార మొద‌టి కూచిపూడి డ్యాన్స్ ఇది. ప‌విత్ర శ్రీ‌రామ‌న‌వమి రోజున ఈ నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ను మీకు చూపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

Advertisement

రాముడి గొప్ప‌ద‌దాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది” అని సితార వీడియోను మ‌హేశ్ బాబు పోస్ట్ చేశారు. త‌మ కూతురికి కూచిపూడి నేర్పించిన వారికి ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు శ్రీ‌రామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు మ‌హేశ్ బాబు పేర్కొన్నారు. సితార చేసిన డ్యాన్స్‌పై మ‌హేశ్ బాబు అభిమానులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.సితార చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సితార సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇటీవలె కళావతి పాటతో మెస్మరైజ్‌ చేసిన సితార..రీసెంట్‌గా పెన్నీ సాంగ్‌లో తళుక్కున మెరిసింది. ఇప్పటివరకు వెస్ట్రన్‌ డ్యాన్స్‌ స్టెప్పులతో ఆకట్టుకున్న సీతూ పాప తొలిసారిగా కూచిపూడి డ్యాన్స్‌ చేసింది.

Sitara Kuchipudi Dance for first time in Video

Advertisement

Sitara : సితార కూచిపూడి డ్యాన్స్..

ఇక మ‌హేష్ త‌మ కూతురికి కూచిపూడి నేర్పించిన వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు శ్రీ‌రామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు మ‌హేశ్ బాబు పేర్కొన్నారు. సితార చేసిన డ్యాన్స్‌పై మ‌హేశ్ బాబు అభిమానులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. మహేష్ బాబు తరువాత ఎక్కువగా సితారనే ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. ఇక సితార, మహేష్ కలిసి చేసే అల్లరి మామూలుగా ఉండదు. అయితే కొన్ని రోజుల నుంచి సితార ఎక్కువగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది. ఆనీ మాస్టర్ నేతృత్వంలో సితార డ్యాన్స్ నేర్చుకుంటూ వచ్చింది. అయితే అదేదో టైం పాస్ కాదని, సర్కారు వారి పాట సినిమా కోసమని తాజాగా తెలిసి వచ్చింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి