Home » Entertainment » Sitara Non Stop Entertainment Video Viral
Entertainment

Sitara : ఫ్రెండ్‌తో సితార సంద‌డి మాములుగా లేదుగా.. అభిమానుల‌కి పండ‌గే..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 5, 2022, 2:30 pm
Advertisement

Sitara: మ‌హేష్ గారాల ప‌ట్టి సితార ఈ మ‌ధ్య కాలంలో తెగ యాక్టివ్ అయింది. సోష‌ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ.. ఫోటోస్.. ఫ్యామిలీ ఫోటోస్.. డ్యాన్సింగ్ వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. చిన్న వయసులోనే సితారకు ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. ఇటీవల మహేష్ నటిస్తోన్న సర్కారు వారి పాట నుంచి కళావతి పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేసి అదుర్స్ అనిపించుకుంది. అలాగే.. సింగింగ్‏లోనూ సితార వేరీ టాలెంటెడ్. ఎప్పుడూ నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‏గా ఉండే సీతు పాప.. పెన్నీ సాంగ్‌లో తన డ్యాన్స్ .. ఎక్స్‏ప్రెషన్స్‏తో అదరగొట్టింది.

Advertisement

మ‌హేష్ , సితార ఒకే పాట‌లో క‌నువిందు చేయ‌డంతో కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. సితార యాక్టివ్‌నెస్‌కి ఫిదా అవుతున్నారు.సర్కారు వారి పాట సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్ తో వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతుంది సితార‌. ఇందులో మహేశ్ మాస్ స్టెప్పులకు తోడూ ఆయన కూతురు ఎంట్రీతోనే చేసిన డాన్స్.. ఫ్యాన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఫారిన్‌ లేడి గ్రూప్‌తో సూపర్ స్టార్ డ్యాన్స్‌ చేస్తుంటే.. మరో గ్రూప్‌ లీడ్‌ డ్యాన్స్‌ర్‌ గా సూపర్ డాటర్ స్టెప్పులేసింది. ఇలా తండ్రి కూతుళ్లను ఒకే పాటలో చూసి మహేశ్ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపించే సితార.. ఇప్పుడిలా సర్కారు వారి పాట కోసం వచ్చేసి అందర్నీ ఫిదా చేసింది.

sitara non stop entertainment Video viral

Advertisement

Sitara : సితార్ నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్..

రీసెంట్‌గా పెన్నీ సాంగ్‌కి మ‌రోసారి డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టింది.ఇక తాజాగా ఇంగ్లీష్ సాంగ్‌కి సితార త‌న‌దైన స్టైల్‌లో స్టెప్పులు వేస్తూ కేక పెట్టించింది. ఈ చిన్నారి టాలెంట్‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. అంతేకాదు సితార క్యూట్ నెస్‌కి మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఇటీవల సితార ఏ పోస్ట్‌ పెట్టినా అది నెట్టింట వైరల్‌ అవుతుంది. ఆ మధ్య‘ సర్కారు వారి పాట’ నుంచి కళావతి పాటకు స్టెప్పులేస్తే.. అది నెట్టింట చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత అదే సినిమాలో ‘ఎవ్రీ పెన్ని’ పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేసి ఔరా అనిపించింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సితూ పాప పోస్ట్‌ చేసిన వీడియో కూడా వైరల్‌ అయింది

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి