
Sobhita Dhulipala : అక్కినేని కొత్త కొడలికి ఇది ఛాలెంజే... అమల స్థానాన్ని నిలబెట్టగలదా ?
Sobhita Dhulipala : టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య కొన్నేళ్ల క్రితం సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లపాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఊహించని విధంగా 2021లో విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల తర్వాత కొన్నాళ్లపాటు సింగిల్‌గా ఉన్న నాగ చైతన్య ఆగస్ట్ 8న శోభితతో నిశ్చితార్థం జరుపుకున్నారు. వీరి నిశ్చితార్థం జరిగి వారం రోజులు అవుతున్నా జనాలు మాత్రం వీరిద్దరి నిశ్చితార్థం గురించి, వీరిద్దరి లవ్ గురించే పెద్దఎత్తున చర్చ చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎప్పటి నుంచి మొదలైంది? వీరిద్దరూ ఎప్పటినుంచి కలుసుకుంటున్నారు? నాగచైతన్యతో సమంత కలిసి ఉన్న రోజుల్లోనే వీరి మధ్యలో ఎఫైర్ నడిచిందా? ఇట్లాంటి అనేక రకాల ప్రశ్నలు నెటిజెన్లకు నాగచైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ తో ఉత్పన్నమవుతున్నాయి.
మరోవైపు శోభితను నాగార్జున భార్య అమల తో పోలుస్తున్నారు. అమల కి ఉన్నంత బాధ్యత శోభితకి ఉంటుందా? అక్కినేని కుటుంబంలోకి రాబోతున్న శోభిత ఫ్యామిలీ కోసం అమల మాదిరి కెరీర్ త్యాగం చేస్తుందా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. 1992లో అక్కినేని నాగార్జున హీరోయిన్ అమలను రెండో వివాహం చేసుకోగా, ఆమె తన కుటుంబం కోసం కెరీర్ ని పక్కన పెట్టింది.పెళ్ళైన ఏళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సెలెక్టీవ్ గా తల్లి పాత్రలు, గెస్ట్ రోల్స్ చేస్తుంది. నాగ చైతన్య శోభితను రెండో వివాహం చేసుకోబోతున్నారు. ఆమె కూడా నటనకు గుడ్ బై చెబుతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. నాగ చైతన్య మాజీ భార్య సమంతకు అక్కినేని ఫ్యామిలీ కెరీర్ విషయంలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది.
Sobhita Dhulipala : అక్కినేని కొత్త కొడలికి ఇది ఛాలెంజే… అమల స్థానాన్ని నిలబెట్టగలదా ?
నాగ చైతన్య కూడా ఆమెను ప్రోత్సహించాడు. సమంత వివాహం అనంతరం కూడా బోల్డ్ రోల్స్ చేసింది. నాగ చైతన్యతో విభేదాలకు అది కూడా కారణం అంటారు. ఒకవేళ శోభిత నటన కొనసాగిస్తే నాగ చైతన్య-శోభిత బంధం ఒడిదుడుకులు లేకుండా సాగుతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి . ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. మరి శోభిత బోల్డ్ రోల్స్ లో నటిస్తుందా, లేదంటే కొన్నాళ్లపాటు తన కెరీర్‌కి బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత కూల్ అండ్ కామ్ రోల్స్ చేసుకుంటూ వెళుతుందా అని అందరు ముచ్చటించుకుంటున్నారు
Fast Eating : నేటి వేగవంతమైన జీవనశైలిలో మనుషులు ప్రతి పనినీ త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ తొందరలో…
Nails : ఉపిరితిత్తుల క్యాన్సర్‌ను సాధారణంగా దగ్గు, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాల ద్వారా గుర్తిస్తారని మనం…
Pakistan : పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా తయారైందంటే.. బయటకి మాత్రం గొప్పలు చెప్పుకుంటూ లోపల మాత్రం చిల్లి గవ్వ…
Mahila Reservation Bill : మూడింట రెండొంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు వీగిపోవడం Lok Sabha : లోక్‌సభలో కేంద్ర…
Iran Usa : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఒక షాకింగ్ నివేదిక బయటకు వచ్చింది. ఇరాన్ మరియు…
Vijay Sai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు అత్యంత కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డి రాజకీయ…
Tax Rules Gold : భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు అది ఒక భావోద్వేగం…
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. అదే మంత్రివర్గ విస్తరణ. ముఖ్యంగా…
TRS : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పాత జెండా పేరు చుట్టూ వేడి చర్చలు మొదలయ్యాయి. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను…
Ajay Ghosh : టాలీవుడ్‌లో మరోసారి రెమ్యూనరేషన్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఇటీవల…
Cold Water : వేసవి కాలం మొదలయ్యిందంటే చాలు, చల్లటి నీటి కోసం ప్రతి ఇంటిలో ఫ్రిజ్ తలుపులు ఎక్కువసార్లు…
Paapam Prathap Movie Review in Telugu : టాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన…
This website uses cookies.