Home » Entertainment » Sohel New Movie Casting Call Auditions
Entertainment

ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలెట్టేశారు.. జోరు మీదున్న సోహెల్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 15, 2021, 10:28 am
Advertisement

బిగ్ బాస్ నాల్గో సీజన్ నుంచి బయటకు వచ్చాక సోహెల్ బాగానే బిజీగా ఉన్నాడు. షోలో చేసిన అల్లరి, గొడవలు, ఎమోషన్స్ ఇలా అన్నింట్లోనూ సోహెల్ అందరినీ ఎంటర్టైన్ చేశాడు. చివరకు 25 లక్షలు తీసుకుని ఆటను మలుపు తిప్పాడు. అలా 25 లక్షలు రావడమే కాకుండా అదనపు డబ్బు, పేరు, క్రేజ్ ఇలా అన్ని కూడా సోహెల్ ఖాతాలో పడ్డాయి. ముఖ్యంగా బిగ్ బాస్ నాల్గో సీజన్ విన్నర్ కంటే సోహెల్ ఎక్కువగా హాట్ టాపిక్ అయ్యాడు.

Advertisement

Sohel New movie casting call auditions

పైగా అందరి కంటే ముందు సినిమాను ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. సోలో హీరోగా రాబోతోన్న సోహెల్ సినిమా పనులు ప్రారంభమయ్యాయి. జార్జీరెడ్డిని నిర్మించిన బ్యానర్ సోహెల్‌తో సినిమాను ప్రకటించింది. మొత్తానికి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. ఆ మధ్య ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఫిబ్రవరి నుంచి సినిమాను షూట్ చేస్తామని సోహెల్ చెప్పుకొచ్చాడు. తాజాగా వాటికి సంబంధించిన పనులే ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

Advertisement

ఇందులో భాగంగా ఈ సినిమాలో నటించేందుకు కొత్త వారికి ఆహ్వానం పలుకుతోంది చిత్రయూనిట్. ఈ మేరకు క్యాస్టింగ్ కాల్‌ను ప్రకటించింది. ఏడు నుంచి పదేళ్ల లోపు ఓ బాలుడు, 20 నుంచి 25 ఏళ్ల అమ్మాయి.. 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల మహిళ, 40 నుంచి 60 ఏళ్ల వయస్సున్న పురుషుడు, 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండే అబ్బాయి కోసం వెతుకుతున్నట్టు ప్రకటించాడు. ఆడిషన్స్ 23, 24 తేదీల్లో జరుగుతాయని ప్రకటించారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి