Sreeja Konidela : మెగా డాటర్స్ శ్రీజ కొణిదెల, సుష్మిత కొణిదెల, అమల అక్కినేని వంటి వారు సహజంగా బయట ఎక్కువగా కనిపించరు. ఇక ప్రమోషనల్ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ వంటివి చేయరు. కానీ మొదటి సారిగా శ్రీజ, సుష్మిత, అమల వంటి వారు ఓ షాపింగ్ మాల్‌ను ఓపెన్ చేశారు. కళామందిర్ రాయల్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఈ ముగ్గురూ సందడి చేశారు. హైదరాబాద్ లో “కళామందిర్ రాయల్” బ్రాండ్ ఘనంగా ప్రారంభం అయింది. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 36లో ఇది అందుబాటులోకి వచ్చింది. దీనిని ప్రముఖ నటి, సామాజిక వేత్త అమల అక్కినేని, సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల స్టోర్ ప్రారంభించారు.
వీరితో పాటు ఈ కార్యక్రమంలో దివ్య రెడ్డి, దీపికా రెడ్డి, పద్మజ ల్యాంకో, శుభ్ర మహేశ్వరి, కల్పన తదితరులు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో చీరల రిటైల్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన బ్రాండ్ కళామందిర్. ఇది ఇప్పుడు జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో తన కొత్త ప్రీమియం బ్రాండ్ “కళామందిర్ రాయల్” గ్రూప్ 49వ షోరూమ్‌తో ముందుకు వచ్చింది. కొత్త బ్రాండ్ కళామందిర్ కి అప్ గ్రేడ్ వెర్షన్. ఇది ఎంపిక చేసిన ప్రత్యేకమైన పట్టు సేకరణకు ప్రసిద్ధి చెందింది. కళామందిర్ రాయల్ అనేది చేతితో ఎంపిక చేసిన పట్టు, పైథాని, పటోలా, చేనేత, కోటా, డిజైనర్, ఖాదీ చీరల కోసం ఒక సరికొత్త స్టోర్. కొత్త స్టోర్ ఒక రకమైన ప్రీమియం ఎలివేషన్ మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇంటీరియర్‌లను ఆకర్షణీయంగా కలిగి వుంటుంది.
ఈ సందర్భంగా కళామందిర్ రాయల్ డైరెక్టర్ కళామందిర్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కళామందిర్ రాయల్ దివ్యమైన ప్రదేశమని, నేటి మహిళా ప్రమాణాలకు తగ్గట్టుగా అత్యంత నిశితంగా, అపూర్వంగా రూపొందించిన ఉత్పత్తులు కళామందిర్ రాయల్ మొదటి స్థానంలో నిలుస్తాయన్నారు. ప్రత్యేకమైన, ప్రత్యేకమైన చీరల సేకరణను ఇష్టపడే నగర మహిళల కోసం ఈ స్టోర్ ఏర్పాటు చేశామ’ని అన్నారు. ఇక ఇలా మెగా డాటర్లు వచ్చి షోరూంను ఓపెన్ చేయడంతో.. అందరి దృష్టి పడింది. ప్రస్తుతం ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో శ్రీజ, సుష్మిత చేసిన సందడి, వాటికి సంబంధించిన ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మామూలుగా అయితే హీరోయిన్లు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలకు హాజరవుతుంటారు. మొదటి సారిగా మెగా డాటర్లు ఇలా మెరిశారు.
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
This website uses cookies.