Home » Entertainment » Sreeja Konidela Emotional Post In Instagram
Entertainment

Sreeja Konidela : కష్ట,సుఖాల్లో తోడున్నారు.. శ్రీజ కొణిదెల ఎమోషనల్ పోస్ట్

Authored By
aruna
The Telugu News | Published on: September 21, 2022, 6:30 pm
Advertisement

Sreeja Konidela : మెగా డాటర్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఆమె వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వివాదాస్పదంగానే మారుతుంది. మొదటి వివాహాం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. ఫ్యామిలీ మీదే శ్రీజ కేసు పెట్టే వరకు వెళ్లింది. అలా శ్రీజ మొదటి పెళ్లి, విడాకులు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మొదటి భర్త వల్ల ఓ బిడ్డ పుట్టింది. ఆమె పేరు నివృత్తి. మళ్లీ రెండో పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లి వల్ల నవిష్క పుట్టింది. అయితే ఈ రెండో పెళ్లి కూడా విడాకుల వరకు వచ్చిందని టాక్ ఎక్కువైంది.

Advertisement

శ్రీజ గానీ మెగా ఫ్యామిలీ గానీ కళ్యాణ్ దేవ్ గానీ ఇలా ఏ ఒక్కరు కూడా ఈ విడాకుల రూమర్ల మీద స్పందించడం లేదు. కనీసం ఖండించడం లేదు. మరి ఏం జరుగుతుందన్నది తెలియడం లేదు. అయితే శ్రీజ మాత్రం తన పాటికి తాను తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంటూ ఎప్పుడూ సరదాగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. రామ్ చరణ్ అయితే తనతో పాటే తన చెల్లిని తీసుకెళ్తున్నాడు. వెకేషన్లంటూ తిప్పుకుని వస్తున్నాడు. మెగా సిస్టర్లంతా కలిసి పార్టీలు చేసుకుంటున్నారు.

Sreeja Konidela Emotional post In Instagram

Advertisement

ఇలా శ్రీజ బాధలన్నీ పోగొట్టేలా ఫ్యామిలీ అంతా ప్రయత్నిస్తోంది. దీనిపై శ్రీజ ఎమోషనల్ పోస్ట్ వేసింది. నా కష్టసుఖాల్లో తోడున్న అందరికీ థాంక్స్.. నేను కోపంలో ఉన్నప్పుడు నవ్వించారు.. ఏడుస్తున్నప్పుడు భుజాన్ని అందించారు.. నేను మాట్లాడాలని అనుకున్నప్పుడు మీ విన్నారు.. నాకు అండగా నిలబడినందుకు థాంక్స్.. నా మాటలు వింటున్నందుకు థాంక్స్.. నేను బాగా ఉన్నానా? అని యోగక్షేమాలు తెలుసుకుంటున్నందకు థాంక్స్.. నా పిచ్చి మూడ్ వేరియేషన్స్‌ను భరిస్తున్నందుకు థాంక్స్..

నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు.. ఇలాంటి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దొరికినందుకు నేను ఎంతో లక్కీ అంటూ శ్రీజ ఎమోషనల్ పోస్ట్ వేసింది. అయితే కళ్యాణ్ దేవ్ శ్రీజ విషయంలో మాత్రం ఎవ్వరికీ క్లారిటీ రావడం లేదు. ఈ ఇద్దరూ అధికారికంగా ఈ విషయాలను ఎప్పుడు చెబుతారో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి