Jathi Ratnalu : ఈ టీవీ మల్లెమాల వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదలు పెట్టిన జాతిరత్నాలు కార్యక్రమం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఈటీవీ ప్లస్ లో టెలికాస్ట్ అవుతున్న జాతి రత్నాలు కామెడీ కార్యక్రమం రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన రేటింగ్ బయటకు వచ్చింది. శ్రీముఖి యాంకర్ గా గతంలో మంచి పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కనుక ఈ కార్యక్రమానికి ఆమె ఖచ్చితంగా ప్రధాన హైలెట్ గా నిలుస్తుందని.. కామెడీ ఎలా ఉన్నా ఆమె వల్ల అంతో ఇంతో రేటింగ్ వస్తుందని నిర్వాహకులు మరియు ప్రేక్షకులు భావించారు.
కానీ అనూహ్యంగా దారుణమైన రేటింగ్ వచ్చింది. చెప్పుకోలేని రేటింగ్ రావడంతో కార్యక్రమ నిర్వాహకులు ఆలోచనలో పడ్డారని సమాచారం అందుతోంది. కమెడియన్స్ కి మరియు ఇతర ఖర్చులకు భారీగా ఖర్చు చేస్తున్నారు. దాంతో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు నెట్టుకు రావడం కష్టం అంటూ కొందరు చేతులెత్తేసే ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈటీవీ ప్లస్ లో టెలికాస్ట్ అయిన కామెడీ కార్యక్రమం తో పోలిస్తే ఈ కార్యక్రమం మరీ దారుణమైన రేటింగ్ సాధించడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కామెడీ అనేది తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చూపించి ఉంటే తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ వచ్చి ఉండేది.. కానీ ఆ విషయంలో వారు విఫలం అయ్యారు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో గత కొంత కాలంగా వస్తున్న కామెడీ పంచులు మళ్లీ వీళ్లు కూడా కొనసాగిస్తున్నారని, అందుకే ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదంటూ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలను టీవీలో చూస్తూ యూట్యూబ్ లో కూడా వాటిని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు ఉన్నారు. కానీ జాతిరత్నాలు కార్యక్రమాన్ని యూట్యూబ్ లో కూడా జనాలు చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. జబర్దస్త్ కామెడియన్స్ ఇక్కడ ఉన్న కూడా ఎందుకో ఆశించిన స్థాయిలో వర్క్ ఔట్ అవ్వడం లేదు అంటూ టాక్ వినిపిస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.