Home » Entertainment » Sreemukhi Reel With His Brother Sushruth
Entertainment

Sreemukhi : చివరకు ఒప్పించేశానన్న రాములమ్మ.. తమ్ముడితో అలా చేసిన శ్రీముఖి

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 20, 2021 4:58 pm
Advertisement

Sreemukhi : శ్రీముఖి ప్రస్తుతం అవినాష్ పెళ్లిలో సందడి చేస్తోంది. శ్రీముఖి గ్యాంగ్ మొత్తం అక్కడే ఉన్నట్టు కనిపిస్తోంది. శ్రీముఖి, ఆర్జే చైతూ, శ్రీముఖి సోదరుడు శుశ్రుత్ఇలా అందరూ కూడా నిన్నటి నుంచి అవినాష్ పెళ్లిలో సందడి చేస్తున్నట్టు కనిపిస్తోంది. హల్దీ, మెహందీ ఫంక్షన్‌లో శ్రీముఖి చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. చేతికి గోరింటాకు పెట్టుకుని శ్రీముఖి చేసిన సందడి అంతా ఇంతా కాదు.

Advertisement

Sreemukhi Reel With His Brother Sushruth

ఇక అవినాష్ చేతి మీదున్న గోరింటాకు కూడా చూపించింది. తన భార్య పేరును డిజైన్‌గా వేయించుకున్నాడంటూ చూపించేసింది శ్రీముఖి. అయితే శ్రీముఖి తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. మామూలుగానే శ్రీముఖి ఎక్కువగా రీల్ వీడియోలు చేస్తుంటుంది. ఆమె చేసే రీల్ వీడియోలు మామూలుగా ఉండవు. ఆ మధ్య శేఖర్ మాస్టర్‌తో కలిసి చేసిన రీల్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది.

Advertisement

Sreemukhi : రీల్ వీడియోతో శ్రీముఖి రచ్చ..

Sreemukhi Reel With His Brother Sushruth

అయితే తన తమ్ముడు మాత్రం ఎప్పుడూ కూడా ఇలా రీల్ వీడియోలో కనిపించలేదు. అతడికి అలాంటివి ఇష్టముండదట. కానీ చివరకు ఒప్పించేశాను అని చెబుతూ.. అతడితోనే ఓ రీల్ వీడియో చేసేసింది. మొత్తానికి తమ్ముడిని కూడా చెడగొట్టేసింది. మొత్తానికి ఈ అక్కాతమ్ముళ్ల మొదటి రీల్ వీడియోను తీసింది ఆర్జే చైతూ. తనకు వీడియో క్రెడిట్ ఇవ్వలేదని తెగ బాధపడిపోతోన్నాడు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి