Home » Entertainment » Sreemukhi Weekend Party Reel Video
Entertainment

Sreemukhi : వోడ్కా కలిపి తాగేసిందిగా.. శ్రీముఖి వీకెండ్ పార్టీ అదిరిందిగా

Authored By
aruna
The Telugu News | Published on: May 30, 2022, 8:00 pm
Advertisement

Sreemukhi : శ్రీముఖి వీకెండ్ వస్తే తన గ్యాంగుతో కలిసి తెగ అల్లరి చేస్తుంటుంది. పార్టీలు, పబ్బులు అంటూ తిరుగుతూ ఉంటుంది. లేదా తన ఇంట్లోనే హంగామా చేస్తుంటుంది. అసలే ఇప్పుడు శ్రీముఖి వరుస షూటింగ్‌లతో బిజీగా మారింది. జీ తెలుగు, ఈటీవీలో షోలో చేస్తూ బిజీగా ఉంది. సరిగమప షోకు హోస్ట్‌గా మారింది. అక్కడ బాగానే ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు ఈటీవీ ప్లస్‌లో ఇప్పుడు శ్రీముఖి మళ్లీ హంగామా చేయడం మొదలుపెట్టేసింది. ఒకప్పుడు పటాస్ షోతో శ్రీముఖి వెలుగు వెలుగిపోయింది.

Advertisement

పటాస్ షోతో శ్రీముఖి యూత్ ఆడియెన్స్‌కి బాగా దగ్గరైంది. పటాస్ షోతోనే టాప్ యాంకర్‌గా మారింది. అలా క్రేజ్ రావడంతోనే బిగ్ బాస్ షో ఆఫర్ వచ్చింది. కానీ బిగ్ బాస్ మాత్రం శ్రీముఖి కెరీర్‌కు ఏ రకంగానూ ఉపయోగపడలేదు. ఎక్కువగా నెగెటివిటీని మూట గట్టుకుంది. అలా శ్రీముఖికి బిగ్ బాస్ అనేది ఓ ఎక్స్‌పీరియన్స్‌గా మిగిలింది. ఆ తరువాత వచ్చిన అవకాశాలను కూడా నిలబెట్టుకోలేకపోయింది. శ్రీముఖి ఏ షో చేస్తే ఆ షో మధ్యలో అటకెక్కే పరిస్థితి వచ్చింది. అలా శ్రీముఖికి బుల్లితెరపై ఓ సరైన షో పడకుండా పోయింది.

Sreemukhi weekend party reel video

Advertisement

మళ్లీ ఇన్ని రోజులకు శ్రీముఖికి సరైన షో పడింది. జాతి రత్నాలు అంటూ బుల్లితెరపై శ్రీముఖి సందడి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే శ్రీముఖి రచ్చ వేరే లెవెల్‌లో ఉంటుంది. రీల్ వీడియోలతో శ్రీముఖి చేసే డ్యాన్సులు, వేసే చేష్టలు మామూలుగా ఉండవు. పొట్టి బట్టల్లో శ్రీముఖి అందరినీ కట్టిపడేస్తుంటుంది.తాజాగా వీకెండ్ స్పెషల్‌గా ఇంట్లో చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. శ్రీముఖి, తన స్నేహితురాలు ఇంట్లోనే స్పెషల్ డిష్‌లు చేశారు. చేపల ఫ్రైని స్వయంగా శ్రీముఖి చేసింది.

ఇక అనంతరం జ్యూస్, వోడ్కాలను కలిపి కొట్టేశారు. దీనిపై శ్రీముఖి ఓ రీల్ వీడియోను చేసి వదిలింది. ఇందులో శ్రీముఖి వేసుకున్న పొట్టి డ్రెస్, వోడ్కా మ్యాజిక్ మూమెంట్స్ రెండూ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి శ్రీముఖి మాత్రం వీకెండ్ ఇలా స్పెషల్‌గా ఇంట్లోనే పార్టీని జరుపుకుంది.

Advertisement

[2:35 pm, 30/05/2022] Bharath Gilakathula:

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి