Home » Entertainment » Sri Reddy Post Viral
Entertainment

Sri Reddy : తాట తీసేందుకు బ‌య‌లు దేరిన శ్రీ రెడ్డి.. ఎవ‌రిది అంటారు..!

Authored By
Sam C
The Telugu News | Published on: May 16, 2022, 1:30 pm
Advertisement

Sri Reddy : క్యాస్టింగ్ కౌచ్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింన లేడి డాన్ శ్రీ రెడ్డి ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. యూట్యూబ్‌లోను స‌రికొత్త వంట‌కాల‌ను ప‌రిచ‌యం చేస్తూ తెగ సంద‌డి చేస్తుంది. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి తాజాగా సోషల్ మీడియా వేదికగా చీరకట్టులో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.చీరకట్టులో సాంప్రదాయానికి పెట్టింది పేరు అనేలా ఉన్న శ్రీ రెడ్డి ఈ ఫోటోని షేర్ చేస్తూ మాస్ క్యాప్షన్ జోడించారు. చీరకట్టులో సెల్ఫీకి ఫోజులిచ్చిన ఈమె ఈ ఫోటోని షేర్ చేస్తూ లేట్ అయినా తాట తీయడం నా తర్వాతే ఎవరైనా ఆన్ ది వే అంటూ క్యాప్షన్ పెట్టారు.

Advertisement

ఈ క్రమంలోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఫోటో చూసిన అభిమానులు శ్రీ రెడ్డి చేతిలో ఎవరికో మూడింది. ఈమె ఎవరి తాట తియ్యడానికి వస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తాట తీయడానికి వస్తున్నానని చెప్పడంతో నిజంగానే ఎవరికో ఈమె స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. శ్రీ రెడ్డి సినిమాకి సంబంధించిన వాళ్లైన , రాజ‌కీయ నాయ‌కులినైన విమ‌ర్శిస్తూ దారుణ‌మైన కామెంట్స్ చేస్తూ ఉంటుంది. శ్రీ రెడ్డి చేసే కామెంట్స్ ఒక్కోసారి హాట్ టాపిక్‌గా కూడా మారుతుంటాయి.

sri reddy post viral

Advertisement

Sri Reddy : శ్రీ రెడ్డి చేతిలో మూడింది..!

హీరోయిన్‌ అవ్వాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన శ్రీరెడ్డి.. ఆరంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది.అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాతో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత ‘అరవింద్ 2’, ‘జిందగీ’ వంటి వాటిలో నటించింది. ఆ తర్వాత వెండితెరకు దూరమైపోయింది. అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది. దీంతో బాగా పాపులారిటీని కూడా పెంచుకుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి