Home » Entertainment » Sridevi Drama Company Goes With Out Sudigali Sudheer
Entertainment

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌ పోయాక శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్‌ ఎపిసోడ్‌ టాక్ ఏంటీ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: June 8, 2022 12:52 am
Advertisement

Sudigali Sudheer : తెలుగు బుల్లి తెర సూపర్‌ స్టార్‌ ఎవరు అంటే ఠక్కున చెప్పే పేరు సుడిగాలి సుధీర్‌. జబర్దస్త్‌ తో పాటు ఢీ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీల్లో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. అద్బుతమైన ఆయన ఎంటర్‌ టైన్మెంట్‌… ఆయన కామెడీ టైమింగ్‌.. ఆయన ఇన్నోసెంట్‌ లుక్స్ ఇంకా ఆయన రొమాన్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆయన్ను సూపర్‌ స్టార్‌ చేశాయి అనడంలో సందేహం లేదు. అలాంటి సూపర్ స్టార్‌ కాస్త ఇప్పుడు ఈటీవీ మల్లెమాల వారికి దూరం అయ్యి స్టార్‌ మా వైపు అడుగులు వేయడం జరిగింది. అక్కడ సుధీర్‌ కి మంచి హోదా మరియు పారితోషికం అయితే దక్కింది.

Advertisement

సుధీర్‌ అయితే హ్యాపీగా వెళ్లి పోయాడు. కాని ఇప్పుడు ఆయన వదిలేసి వెళ్లి పోయిన జబర్దస్త్‌ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీల పరిస్థితి ఏంటీ అనేది అందరికి అర్థం అవుతోంది. ఇప్పటికే జబర్దస్త్‌ లో సుధీర్‌ లేక పోవడంతో రామ్‌ ప్రసాద్‌ సొంతంగా స్కిట్‌ లు చేస్తున్నాడు. సొంత టీమ్‌ ను ఏర్పాటు చేసుకుని రామ్‌ ప్రసాద్‌ నెట్టుకు వస్తున్నాడు. సుధీర్‌ లేని లోటు ఖచ్చితంగా రామ్‌ ప్రసాద్‌ టీమ్‌ లో కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ పరిస్థితి మరీ దారుణం. శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా సుధీర్‌ కాకుండా మరెవ్వరు వచ్చినా కూడా ఒక ఆట ఆడేసుకునే వారు.

Sridevi Drama Company goes with out Sudigali Sudheer

Advertisement

అందుకే ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా ముద్రపడ్డ రష్మి గౌతమ్‌ ను తీసుకు రావడం జరిగింది. తాజాగా మొదటి ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయ్యింది. సుధీర్ లేని లోటు వందకు రెండు వందల శాతం కనిపించింది. ఆ విషయాన్ని స్వయంగా రామ్‌ ప్రసాద్ మరియు హైపర్ ఆదిలు చెప్పుకొచ్చారు. రష్మి తెలుగు మాట్లాడటం కోసం ఎంత కష్టపడుతుందో తెల్సిందే. అలాంటి రష్మి జబర్దస్త్‌ ను ఏదో విధంగా నెట్టుకు వస్తుంది. ఇలాంటి సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీ బాధ్యత కూడా ఆమెకు అప్పగిస్తే ఖచ్చితంగా కష్టమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి