Home » Entertainment » Sridevi Drama Company Latest Episodes Not Success
Entertainment

Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ఎపిసోడ్‌ ప్లాప్ కు కారణాలు రెండు.. అవి ఇవే

Authored By
Himanshi
The Telugu News | Updated on: February 28, 2022 5:31 pm
Advertisement

Sridevi Drama Company ; శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ఎపిసోడ్ కి ప్రేక్షకుల నుండి సరైన స్పందన లేదు అంటూ టాక్ వినిపిస్తుంది. ఈ టీవీ లో ప్రసారమైన ఈ షో మాత్రమే కాకుండా యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఎపిసోడ్‌ కు కూడా పెద్దగా స్పందన రావడం లేదు. దాంతో అసలు తప్పు ఎక్కడ జరిగింది అంటూ నిర్వాహకులు ఇప్పుడు లెక్కలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇన్ని రోజులు శ్రీదేవి కంపెనీ డ్రామా కంపెనీ ప్రతి ఎపిసోడ్ లో కూడా అందమైన అమ్మాయిలు సందడి.. కామెడీ చేసే వారు. కానీ ఈ ఎపిసోడ్ లో మాత్రం అమ్మాయిలు లేరు.

Advertisement

సీనియర్ నటీమణులు అంటూ పాత వారిని వాళ్లని తీసుకు వచ్చి కామెడీ చేసే ప్రయత్నం చేశారు. ప్రేక్షకులు ఆ అమ్మాయిల కామెడీకి అలవాటు పడి తాజా ఎపిసోడ్లను పట్టించుకోలేదు అంటూ టాక్ వినిపిస్తోంది. పైగా హైపర్ ఆది కూడా గత రెండు ఎపిసోడ్ ల్లో లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. గత రెండు ఎపిసోడ్స్ ల్లో హైపర్ ఆది కనిపించడం లేదు. ఆది మళ్ళీ వస్తాడా లేదా అనే క్లారిటీ లేదు.

Sridevi Drama Company latest episodes not success

Advertisement

గత రెండు ఎపిసోడ్ లకు హైపర్ ఆది లేకపోవడం మరియు ఈ ఎపిసోడ్లో అమ్మాయిలు కనిపించక పోవడం అనేది పెద్దగ మైనస్‌. అందుకే ఈ రెండు ఎపిసోడ్‌ లకు రేటింగ్‌ రాలేదు. వచ్చేవారంలో అయినా ఆ అమ్మాయిలు మరియు హైపర్ ఆది సందడి చేస్తారేమో చూడాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ భారీ అంచనాల నడుమ ప్రతి వారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ అంచనాలను అందుకోలేక పోతే ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ పడుతున్నారు. అందుకే ప్రతి ఒక్క ఎపిసోడ్ ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉంది.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి